Begin typing your search above and press return to search.

అర్జున్ S/O వైజయంతి టీజర్.. నా కను సైగలు శాసిస్తాయ్

ముఖ్యంగా ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తిరిగి బిగ్ స్క్రీన్‌ పై కనిపించనుండటంతో, సినిమాపై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.

By:  Tupaki Desk   |   17 March 2025 11:15 AM IST
అర్జున్ S/O వైజయంతి టీజర్.. నా కను సైగలు శాసిస్తాయ్
X

నందమూరి కళ్యాణ్ రామ్ మాస్ కమర్షియల్ సినిమాలను చేయడంలో డిఫరెంట్ స్టైల్ ను ఫాలో అవుతుంటాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంభందం లేకుండా సాగుతున్న ఈ హీరో ఈసారి మరో హై వోల్టేజ్ డ్రామాతో రాబోతున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అర్జున్ S/O వైజయంతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తిరిగి బిగ్ స్క్రీన్‌ పై కనిపించనుండటంతో, సినిమాపై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఫైనల్ గా విడుదలైన టీజర్ ఈ అంచనాలను మరింత పెంచేసింది.

కొడుకు కోపం.. తల్లి నిజాయితీ గల ఉద్యోగ బాధ్యతను సినిమాలో హైలెట్ చేసినట్లు అర్ధమవుతుంది. ఎమోషనల్ బాండింగ్ ఉన్న ఈ ఇద్దరు ఒక సమస్య విషయంలో ఎదురుపడితే ఎలా ఉంటుందో అనే ఆసక్తిని కలిగించారు. పోలీస్ వ్యవస్థ అడ్ఫుకోలేని విలన్ వ్యవస్థను హీరో ఊచకోత కోసినట్లు అర్ధమవుతుంది. 'రేపటి నుంచి వైజాగ్ ని పోలీస్ బూట్ లు నల్ల కోట్లు కాదు, నా కను సైగలు శాసిస్తాయ్' అని కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ పవర్ఫుల్ గా ఉంది.

టీజర్, యాక్షన్ ప్యాక్డ్ డ్రామాతో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్‌ హాట్ టాపిక్‌గా మారింది. కళ్యాణ్ రామ్ సినిమాలపై మంచి క్రేజ్ ఉండటంతో పాటు, ఈ సినిమాలో మాస్ యాక్షన్ డోస్ పెంచడంతో థియేట్రికల్ రైట్స్‌కు డిమాండ్ పెరిగింది. సమాచారం ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 30 కోట్లకు పైగానే జరిగినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా నైజాం, సీడెడ్, ఆంధ్రా ఏరియాల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లను బాగా ఆకట్టుకుంది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి పెరిగింది. ఇక సినిమాను సాంకేతికంగా చాలా భారీగా రూపొందించారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని టీజర్‌ చూస్తేనే అర్థమవుతోంది. అదనంగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సినిమాకు మరింత మాస్ అట్రాక్షన్‌ ఇచ్చేలా ఉంది. విజువల్‌ గ్రాండియర్, స్టోరీ ఎమోషనల్ డెప్త్‌ను కలిపిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియెన్స్‌ నుంచి మాస్ ప్రేక్షకుల వరకు అందరికీ కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.

అలాగే, కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో పవర్ఫుల్ యువకుడిగా కనిపించనుండగా, విజయశాంతి పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. వీరిద్దరి మధ్య ఉన్న ఇంటెన్స్ రోల్, అమ్మ ప్రేమ, మాస్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా, విజయశాంతి గ్యాప్ తర్వాత ఈ స్థాయి మాస్ రోల్ చేయడం అభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మొత్తంగా అర్జున్ S/O వైజయంతి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.