Begin typing your search above and press return to search.

మాస్ స్టఫ్ .. మస్త్ జబర్దస్త్ రెస్పాన్స్..!

ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఇక ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ అదిరిపోయింది.

By:  Tupaki Desk   |   13 April 2025 11:13 AM
మాస్ స్టఫ్ .. మస్త్ జబర్దస్త్ రెస్పాన్స్..!
X

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రత్యేకమైన పాత్రలో నటించారు. ఈ ఏంజ్ లో కూడా విజయశాంతి యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. ఈ నెల 18న రిలీజ్ అవబోతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత పాజిటివ్ వైబ్ అందుకుంది. శనివారం మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా అర్జున్ సన్నాఫ్ విజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఇక ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ అదిరిపోయింది. ఇన్నాళ్లు సైలెంట్ గా సినిమా చేస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా ట్రైలర్ తో మాస్ స్టఫ్ అందించాడు. ట్రైలరే ఇలా ఉంది అంటే కచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ట్రైలర్ పర్ఫెక్ట్ కట్స్ తో అదుర్స్ అనిపించేసింది.

అంతేకాదు పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ మళ్లీ ఖాకీ డ్రెస్ లో కనిపించడం నందమూరి ఫ్యాన్స్ కి పక్కా మాస్ ఫీస్ట్ అందించేలా ఉందని అనిపిస్తుంది. డైరెక్టర్ ప్రదీప్ మాస్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ ని కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసినట్టు అనిపిస్తుంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ చూసిన ఆడియన్స్ అంతా కూడా వర్తబుల్ సినిమా అనేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో ఒక మంచి కమర్షియల్ సినిమాకు కావాల్సిన ఎమోషన్, యాక్షన్ బాగా కుదిరినట్టు అనిపిస్తుంది.

సో కళ్యాణ్ రామ్ కి అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఒక భారీ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ముందు బజ్ ఎలా ఉన్నా ట్రైలర్ వచ్చాక ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే కళ్యాణ్ రాం కెరీర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా పై ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు ఏమేరకు నిజం అవుతాయన్నది చూడాలి.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది అన్నది రిలీజ్ నాడు తెలుస్తుంది.