Begin typing your search above and press return to search.

అక్క‌కు ప్రియ‌మైన త‌మ్ముడిని

పృథ్వీ ఈ మాట‌ల‌న‌గానే అక్క‌డున్న ఆడియ‌న్స్ ఒక్క‌సారిగా ఈల‌లు, కేక‌లేస్తూ అరిచారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   11 April 2025 5:58 PM
అక్క‌కు ప్రియ‌మైన త‌మ్ముడిని
X

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా, లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టించిన సినిమా అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ప‌లు చోట్లకు తిరుగుతూ సినిమాను తెగ ప్ర‌మోట్ చేస్తుంది. అందులో భాగంగానే రీసెంట్ గా ముచ్చ‌ట‌గా బంధాలే అనే సాంగ్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లాంచ్ లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. అయితే ఈ సినిమాలో బ‌బ్లూ పృథ్వీరాజ్ కూడా కీల‌క పాత్ర చేసిన సంగ‌తి తెలిసిందే. సాంగ్ లాంచ్ లో భాగంగా విజ‌యశాంతి అంద‌రి గురించి మాట్లాడుతూ బ‌బ్లూ పృథ్వీరాజ్ ను పిల‌వ‌గా ఆయ‌న వ‌చ్చి విజ‌య‌శాంతి కాళ్ల‌కు న‌మ‌స్కారం చేశారు. మీరు నా చిన్న త‌మ్ముడు అని విజ‌య‌శాంతి అన‌గా, నేను అక్క‌కు ప్రియ‌మైన త‌మ్ముడిని అని పృథ్వీ స్టేజ్ పై చెప్పారు.

పృథ్వీ ఈ మాట‌ల‌న‌గానే అక్క‌డున్న ఆడియ‌న్స్ ఒక్క‌సారిగా ఈల‌లు, కేక‌లేస్తూ అరిచారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. దీంతో వీరిద్ద‌రూ క‌లిసి అస‌లు ఎప్పుడు ఏ సినిమాల్లో న‌టించార‌నే విష‌యాల‌ను నెటిజ‌న్లు తెగ వెతుకుతున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి 1999లో వ‌చ్చిన రాజ‌స్థాన్ సినిమాలో న‌టించారు.

ఆ త‌ర్వాత వైజ‌యంతీ సినిమాలో ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. వైజ‌యంతీలో విజ‌యశాంతికి త‌మ్ముడిగా పృథ్వీరాజ్ న‌టించారు. అప్ప‌ట్నుంచే వారి మ‌ధ్య అక్కాత‌మ్ముడి బంధం కొన‌సాగుతూ వ‌స్తుందంటున్నారు. ఇదిలా ఉంటే పృథ్వీరాజ్ ఇప్ప‌టికే 200కు పైగా సినిమాల్లో న‌టించగా వాట‌న్నింటిలో అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతీలో తాను చేసిన పాత్రే క‌ష్ట‌మ‌ని ఆయ‌న ఇప్ప‌టికే వెల్ల‌డించారు.

ఇక సినిమా విష‌యానికొస్తే క‌ళ్యాణ్ రామ్, విజ‌య‌శాంతి త‌ల్లీకొడుకులుగా న‌టిస్తున్న ఈ సినిమాలో స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అవ‌గా, ఆ బ‌జ్ ఇంకాస్త పెంచ‌డానికి చిత్ర యూనిట్ ఏప్రిల్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హిస్తోంది. ఈ ఈవెంట్ కు క‌ళ్యాణ్ రామ్ త‌మ్ముడు, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజ‌రు కానున్నాడు.