Begin typing your search above and press return to search.

మ‌లైకా- అర్జున్ విడిపోలేదు.. చెంప చెల్లుమ‌నేలా!

మలైకా అరోరా ‍- అర్జున్ కపూర్ రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఇటీవ‌ల ఆరాలు ఎక్కువ‌య్యాయి.

By:  Tupaki Desk   |   1 Jun 2024 7:49 AM GMT
మ‌లైకా- అర్జున్ విడిపోలేదు.. చెంప చెల్లుమ‌నేలా!
X

మలైకా అరోరా ‍- అర్జున్ కపూర్ రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఇటీవ‌ల ఆరాలు ఎక్కువ‌య్యాయి. ఈ జంట బ్రేక‌ప్ అయ్యారంటూ ప్ర‌చారం సాగుతోంది. గ‌త కొద్దిరోజులుగా ఈ త‌ర‌హా గాసిప్పులు హిందీ మీడియాలో శ్రుతిమించుతున్నాయి. అయితే ఇది నిజ‌మా? అంటే దానికి వారు స‌రైన జ‌వాబు ఇచ్చారు.

ఇప్పుడు మలైకా అరోరా మేనేజర్ ఇండియా టుడేతో మాట్లాడుతూ వారి బ్రేకప్ పుకార్లన్నింటినీ తోసిపుచ్చారు. మలైకా మేనేజర్ బ్రేకప్ గురించి వచ్చిన పుకార్లను ఖండించారు. ``లేదు కాదు, అవన్నీ పుకార్లు మాత్ర‌మే``నని అత‌డు చెప్పారు. వారి మ‌ధ్య ఎలాంటి క‌ల‌త‌లు లేవు.. సంతోషంగా ఉన్నార‌ని పోర్ట‌ల్ తో ముచ్చ‌టించిన‌ట్టు వెల్ల‌డైంది. ``వారి మధ్య చెడింద‌ని దీని అర్థం కాదు. వారు ఒకరినొకరు గొప్పగా గౌరవించుకుంటారు. ఒకరికొకరు బలం.. సంవత్సరాలుగా వారు తమ బంధానికి చాలా గౌరవం ఇచ్చారు. ఒక‌వేళ‌ విడిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ వారు ఒకరికొకరు అదే గౌరవాన్ని కొన‌సాగిస్తూనే ఉంటారు. వారిద్దరూ కొన్నేళ్లుగా ఘాఢ‌మైన సంబంధంలో ఉన్నారు. ప్రజలు వారిని అర్థం చేసుకుని త‌గిన స్పేస్ ఇస్తార‌ని ఆశిస్తున్నారు`` అని వెల్ల‌డించారు.

మ‌లైకా- అర్జున్ 2018లో మ‌లైకా 45వ పుట్టినరోజు సందర్భంగా తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. చాలా కాలంగా వారి అనుబంధం అంద‌రికీ స్ఫూర్తిగా నిలిచింది. అయితే ఇంతకుముందు 2022లో ఓసారి ఈ జంట‌ విడిపోయినట్లు ఆన్‌లైన్‌లో క‌థ‌నాలొచ్చాయి. ఆ సమయంలో, అర్జున్ ఒక నిగూఢమైన నోట్‌ను షేర్ చేసి త‌న నిరాశ‌ను వ్య‌క్తం చేసాడు. తాము క‌లిసి ఉన్నామ‌ని నీచమైన పుకార్లకు చోటు లేద‌ని వ్యాఖ్యానించారు..అందరినీ ప్రేమించండి అని రాసారు.

అర్జున్ కపూర్‌తో సంబంధానికి ముందు, మలైకా అరోరా వివాహం చేసుకుంది. దాదాపు 19 ఏళ్ల పాటు నటుడు అర్బాజ్ ఖాన్‌కు భార్య‌. ఈ జంట‌కు ఒక టీనేజీ కుర్రాడు ఉన్నాడు. 2017లో విభేధాల‌తో విడాకులు తీసుకున్నారు. అర్బాజ్ డిసెంబర్ 2023లో షురా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అర్జున్ క‌పూర్ తదుపరి `మేరీ పత్నీ కా` రీమేక్ లో కనిపిస్తాడు. అలాగే రోహిత్ శెట్టి `సింగం ఎగైన్`లో విలన్‌గా నటించనున్నాడు.