Begin typing your search above and press return to search.

యాక్ష‌న్ కింగ్ అర్జున్ కుమార్తె పెళ్లి సంద‌డి

సౌత్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్

By:  Tupaki Desk   |   8 Jun 2024 3:48 PM GMT
యాక్ష‌న్ కింగ్ అర్జున్ కుమార్తె పెళ్లి సంద‌డి
X

సౌత్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్.. న‌టుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యను పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. జూన్ 10న ఈ పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. 7 జూన్ 2024న చెన్నైలో ప్రీ వెడ్డింగ్ వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఐశ్వర్య ఇంట్లో జరిగిన హల్దీ వేడుక క‌న్నుల పండుగ‌గా సాగింది. హల్దీ తర్వాత, ఈ జంట చెన్నైలోని ఐశ్వర్య నివాసంలో సన్నిహిత మెహందీ వేడుకను నిర్వహించారు. ఐశ్వర్య షైనీ ఎల్లో క‌ల‌ర్ అనామికా ఖన్నా దుస్తులలో అద్భుతంగా కనిపించింది. సంప్రదాయ అలంకరణ నేపథ్యం ది స్కై టర్న్డ్ పింక్ క‌ల‌ర్ లో ఆక‌ట్టుకుంది. ఐశ్వర్య త్వ‌ర‌లో టాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉండ‌గా, వ‌రుడు ఉమాపతి ద‌ర్శ‌కుడిగా తన రెండవ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు, వారి వివాహం జ‌ర‌గ‌నుండ‌డం ఆస‌క్తిక‌రం.

ఈ జంట‌ పెళ్లి వేడుకలపై అంచనాలు భారీగా ఉన్నాయి. కోవిడ్ వంటి స‌మ‌స్య‌లేవీ లేవు క‌నుక ఇండ‌స్ట్రీ అతిథులు స‌హా అన్ని వ‌ర్గాల నుంచి భారీగా అతిథులు త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం ఉంది. జూన్ 14న చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇది సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. అర్జున్ సర్జా.. అతని భార్య, మాజీ నటి నివేదిత అర్జున్ స్వ‌యంగా ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు అంద‌జేసారు.

ఐశ్వ‌ర్య‌- ఉమాప‌తి ప‌రిచ‌యం ఎలా? అంటే.. అర్జున్ సర్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `సర్వైవర్` అనే రియాల్టీ షోలో ఈ జంట తొలిసారి కలుసుకున్నారు. ఆ ఇద్దరూ ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. గత సంవత్సరం అక్టోబర్‌లో వారి నిశ్చితార్థం పూర్త‌యింది. వారి ప్రేమకథలో అర్జున్ మ‌న్మ‌థుని పాత్ర‌ను పోషించార‌నేది అభిమానుల అభిప్రాయం.

ఐశ్వర్య అర్జున్ 2013లో విశాల్ నటించిన యాక్షన్-కామెడీ చిత్రం `పట్టతు యానై`తో న‌టిగా రంగప్రవేశం చేసింది. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో ఐశ్వర్య న‌టించింది. ప్రేమ బరాహా అనే చిత్రానికి తండ్రి అర్జున్ సర్జా దర్శకత్వం వహించ‌గా, ఐశ్వ‌ర్య ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. ఆమె తల్లి నివేదిత అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2018లో తమిళం, కన్నడ రెండింటిలోనూ విడుదలైన ఈ ద్విభాషా చిత్రం కర్ణాటకలో కమర్షియల్ విజయాన్ని సాధించింది. తమిళ వెర్షన్ యావ‌రేజ్‌గా ఆడింది.