ప్రీ టీజర్.. సముద్రం ఎదురుగా రక్తంతో కళ్యాణ్ రామ్!
నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ అమితాబ్ విజయశాంతి ప్రధాన పాత్రల్లో వస్తున్న అర్జున్ S/O వైజయంతి సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.
By: Tupaki Desk | 14 March 2025 11:31 AM ISTనందమూరి కళ్యాణ్ రామ్, లేడీ అమితాబ్ విజయశాంతి ప్రధాన పాత్రల్లో వస్తున్న అర్జున్ S/O వైజయంతి సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రతీ అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా చిత్రబృందం రిలీజ్ చేసిన ప్రీ టీజర్ ఒక్క షాట్‌తోనే సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేశారు.
కెమెరా రివీల్ చేసిన తొలి విజువల్‌లో, సముద్రపు ఒడ్డున ఓ పడవపై హీరో కళ్యాణ్ రామ్ వెనుక వైపు కూర్చొని కనిపించే విజువల్ హైలెట్ అవుతోంది. తెల్లటి షర్ట్ రక్తపు మరకలతో నిండిపోయి, అతని మౌన దృక్పథం ఎక్కడో ఊహించని పోరుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అతని ఎదుట కనిపిస్తున్న సముద్రం అతని ప్రయాణానికి ఓ సంకేతమా లేక తన ఎదురు దాడికి గట్టి ప్రణాళికనా అనే ప్రశ్నలు ప్రేక్షకుల మనసులో మెదులుతున్నాయి.
ఈ ఒక్క షాట్ ద్వారా సినిమా హై లెవెల్ యాక్షన్ డ్రామాలా ఫీల్ ఇస్తోంది. కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ గా ఉండబోతున్నదని ఈ విజువల్ ద్వారా అర్థమవుతోంది. గతంలో మాస్ యాక్షన్ సినిమాల్లో కనిపించిన అతను, ఈసారి మరింత స్టైలిష్ మాస్ అవతారంలో కనిపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రీ టీజర్ లో కనిపించే ఫ్రేమింగ్ సినిమా విజువల్ టోన్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది.
ఈ మిస్టీరియస్ విజువల్‌తో టీజర్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఒక వైపు కళ్యాణ్ రామ్ పాత్ర రణరంగంలోకి దిగిందన్నది ఆసక్తికరంగా మారగా, మరో వైపు విజయశాంతి IPS రోల్ ఏ విధంగా ఉండబోతోందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ సినిమా కథను కేవలం యాక్షన్ కోణంలో కాకుండా ఒక ఎమోషనల్ డ్రామాగా మలచినట్లు టాక్. అజనీష్ లోకనాథ్ అందిస్తున్న నేపథ్య సంగీతం ఈ విజువల్ కి అదనపు బలం ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, టీజర్ రిలీజ్ డేట్ కూడా ప్రీ టీజర్ లో అనౌన్స్ చేశారు. మార్చి 17న పూర్తి టీజర్ విడుదల చేయనున్నారు. ముప్పా అశోక్ వర్ధన్, సునీల్ బాలుసు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రీ-టీజర్ విజువల్ చూస్తేనే కథలో ఎమోషనల్ డెప్త్, హీరో క్యారెక్టర్ ఆర్క్ ఎంత పవర్ఫుల్‌గా డిజైన్ చేశారో అర్థమవుతోంది. ఇది కేవలం సాధారణ మాస్ సినిమా కాదని, మిస్టరీ, రివేంజ్, యాక్షన్ మిక్స్ చేసి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ అనిపిస్తోంది. ఇక ఫుల్ టీజర్‌తో ఇంకెన్ని ఇంటెన్స్ మోమెంట్స్ బయటకు వస్తాయో లేదో చూడాలి.