Begin typing your search above and press return to search.

ARM ట్రైలర్: మూడు కాలల్లో ఓ దొంగ రహస్యం

2018 సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన టోవినో థామస్, తన 50వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 4:02 AM GMT
ARM ట్రైలర్: మూడు కాలల్లో ఓ దొంగ రహస్యం
X

2018 సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన టోవినో థామస్, తన 50వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ సారి అతను తీసుకురాబోతున్న చిత్రం ‘ARM’, ఇది పాన్ ఇండియా ఫాంటసీ మూవీగా రూపొందుతోంది. కొత్త దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మేజిక్ ఫ్రేమ్స్ మరియు యూజీఎమ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, డాక్టర్ జకారియా థామస్ నిర్మిస్తున్నారు.


‘ARM’ సినిమా 3Dలో తెరకెక్కుతోందని, ఇది మలయాళ సినీ చరిత్రలో అత్యంత సాంకేతికత కలిగిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయినప్పటి నుంచి భారీ ఆసక్తి రేకెత్తించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్ ప్రారంభంలో ఓ భారీ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనడంతో భారీ శబ్దాలు, ధ్వంసకర సన్నివేశాలు కనిపిస్తాయి.

ఆ వెంటనే ఓ వృద్ధురాలు కథని విన్నవిస్తూ మనియ‌న్ అనే వ్యక్తి గురించి చెబుతుంది. ట్రైలర్ లో అనేక యాక్షన్ సన్నివేశాలు, వివిధ కాలాల్లో జరిగే ఘర్షణలు హైలెట్ అయ్యాయి. లో ఉత్తర కేరళలోని 1900, 1950, 1990ల సమయంలో సాగుతున్న కథను చూపించారు. టోవినో థామస్ ఈ చిత్రంలో మూడు పాత్రలు పోషిస్తున్నాడు. మనియన్, కుంజిక్కెలు, అజయన్.

ఈ ముగ్గురు తమ పూర్వీకుల రహస్య సంపదను కాపాడేందుకు పోరాడుతున్నారు. ఈ ట్రైలర్ దృశ్యాలు కేరళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రతి ఫ్రేమ్ రిచ్ గా రూపొందించబడిందని అర్ధమవుతుంది. ఇక టోవినో థామస్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించడం విశేషం. కళారి విద్యలో కూడా అతను శిక్షణ తీసుకున్నాడట. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించేలా ఉంటాయనీ, ప్రత్యేకంగా వాటి కోసం భారీ చర్చలు జరుగుతున్నాయనీ తెలుస్తోంది.

‘కాంతార’ చిత్రానికి స్టంట్స్ చేసిన విక్రమ్ మోర్, ఫీనిక్స్ ప్రభు ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక కృతి శెట్టి, ఐశ్వర్య రాజేశ్, సురభి లక్ష్మీ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జోమన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ, దిబు నైనన్ థామస్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో ఉన్న అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ మరియు విజువల్స్ ఆడియెన్స్ ను కు మంచి థ్రిల్ ఇస్తామని తెలుస్తోంది. ‘ARM’ సినిమా సెప్టెంబర్ 12న మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.