Begin typing your search above and press return to search.

గురువునే మించిన శిష్యుడు!

స్టార్ డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ శిష్యుడు అట్లీ. అత‌డి వ‌ద్ద ఎన్నో సినిమాల‌కు అసిస్టెంట్ గా ప‌నిచేసి డైరెక్ట‌ర్ గా ప్ర‌మోట్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   22 Dec 2024 11:30 PM GMT
గురువునే మించిన శిష్యుడు!
X

స్టార్ డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ శిష్యుడు అట్లీ. అత‌డి వ‌ద్ద ఎన్నో సినిమాల‌కు అసిస్టెంట్ గా ప‌నిచేసి డైరెక్ట‌ర్ గా ప్ర‌మోట్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ఇంత‌వ‌ర‌కూ ఫెయిల్యూర్ లేదు. నేడు పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా ఎదిగాడు. అత‌డు ప‌నిచేసే హీరోలంతా స్టార్ హీరోలే. షారుక్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ అంటూ బాలీవుడ్ నే షేక్ చేస్తున్నాడు. ఇక‌పై అట్లీ ఇండియాలో ప‌నిచేసే హీరోలంతా ఆ రేంజ్ ఉన్న వాళ్లే. అత‌డి స‌క్సెస్ లు చూస్తుంటే? గురువునే మించిపోయాడనిపిస్తుంది.

క‌మర్శియ‌ల్ గా అత‌డి స‌క్సెస్ లే ఆ స్థానంలో కూర్చోబెట్టాయి. తొలి సినిమా `రాజా రాణి` 50 కోట్లు సాధించింది రెండ‌వ చిత్రం `తేరీ` 150 కోట్లు కొల్ల‌గొట్టింది. మూడ‌వ చిత్రం `మెర్స‌ల్` 250 కోట్లు రాబ‌ట్టింది. నాల్గ‌వ చిత్రం `బిగిల్` 350 కోట్లు క‌లెక్ట్ చేసింది. షారుక్ ఖాన్ తో బాలీవుడ్ లో తెర‌కెక్కించిన `జ‌వాన్` ఏకంగా 1100 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. అట్లీ కెరీర్ లో తొలి వెయికోట్ల వ‌సూళ్ల చిత్ర‌మిది.

ఇక ముర‌గ‌దాస్ కెరీర్ 2013 నుంచి చూస్తే? అంటే అట్లీ డైరెక్ట‌ర్ అయిన నాటి నుంచి... `తుపాకీ` 120 కోట్లు, అక్ష‌య్ కుమార్ తో `హాలీడే` 180 కోట్లు రాబ‌ట్టింది. `క‌త్తి` 128 కోట్లు, `స‌ర్కార్` 260 కోట్ల వ‌సూళ్ల చిత్రాలు ముర‌గ‌దాస్ ఖాతాలో న‌మోద‌య్యాయి. అంటే ముర‌గ‌దాస్ ఖాతాలో ఇంకా 500 కోట్ల వ‌సూళ్ల చిత్రం ఒక్క‌టి కూడా లేదు. మ‌హేష్ తో చేసిన `స్పైడ‌ర్`, ర‌జ‌నీకాంత్ తో తెర‌క‌క్కించిన `ద‌ర్బార్` చిత్రాలు భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి.

డైరెక్ట‌ర్ గా స‌క్సెస్ రేసులో శిష్యుడి కంటే గురువు చాలా వెనుక‌బ‌డి ఉన్నారు. క‌మ‌ర్శియ‌ల్ గా అట్లీ చిత్రాలు క‌నెక్ట్ అయిన‌ట్లు గా ముర‌గ‌దాస్ చిత్రాలు క‌నెక్ట్ అవ్వ‌డం లేదు. ముర‌గదాస్ ఎంతో క్రియేటివ్ క‌థ‌లు రాసి సినిమాలు చేస్తారు. అందుకు ఎంతో శ్ర‌మిస్తారు. స్టోరీలు సిద్దం చేయ‌డానికి చాలా స‌మ‌యం తీసుకుంటారు. క‌థ‌లో బోలెడంత విశ్లేష‌ణ ఉంటుంది. అట్లీ సినిమా క‌థ‌ల్లో అంత బ‌లం ఉండ‌దు. ఎనాల‌సిస్ ఉండ‌దు. కానీ కామ‌న్ ఆడియ‌న్ కి క‌నెక్ట్ చేయ‌డంలో అట్లీ దిట్ట‌. అందుకే బాక్సాఫీస్ వ‌ద్ద అత‌డి సినిమాలు సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తున్నాయి.