రెండు లక్షల పవన్ పుస్తకాల రికార్డు ఆయన కొట్టేసేనా
కోలీవుడ్ సంచలనం మురగదాస్ క్రియేటివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `గజిని`, `స్టాలిన్`,` తుపాకీ`, `సర్కార్` లాంటి బ్లాక్ బస్టర్లు ఆయన ఖాతాలో ఉన్నాయి.
By: Tupaki Desk | 16 Oct 2024 9:30 PM GMTకోలీవుడ్ సంచలనం మురగదాస్ క్రియేటివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `గజిని`, `స్టాలిన్`,` తుపాకీ`, `సర్కార్` లాంటి బ్లాక్ బస్టర్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఏ సినిమా చేసినా ప్రేక్షకుడికి కొత్త అనుభూతి పంచడం ఆయన స్పెషాల్టీ. ఒకవేళ సినిమా ప్లాప్ అయినా మరీ అంత చెత్త సినిమా తీసాడనే విమర్శలైతే మురగదాస్ పై లేవు. `దర్బార్`, `స్పైడర్` లాంటి సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు.
కానీ మరీ అంత ప్లాప్ కాదు. వాటిలో ఎగ్జైట్ మెంట్ తీసుకొచ్చే సన్నివేశాలు..పాత్రలు ఎన్నో ఉంటాయి. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేసిన సౌత్ డైరెక్టర్ ఈయన. మరి ఈ ఘనత ఎలా సాధ్యమైంది? అంటే ఆయనకున్న పుస్తక పఠనం అని తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురగదాస్ పుస్తకాలు చదవడం అన్నది ఓ వ్యసనంలా మారిపోయిందన్నారు.
పుస్తకం చదవకపోతే నిద్ర పట్టడం లేదన్నారు. రోజులో కనీసం ఒక పుస్తకమైనా తప్పని సరిగా చదువుతా నన్నారు. ఎక్కువగా ఓషో పుస్తకాలు చదువుతారుట. ఆ తర్వాత జయమోహన్, వైరాముత్తు, భారతీయార్ పుస్తకాలు చదువుతానన్నారు. అలాగే మార్కెట్ లోకి కొత్తగా ఏ పుస్తకం వచ్చినా కొనుక్కుని వచ్చి ఖాళీ సమయంలో తప్పక చదువుతానన్నారు. పుస్తకాలు చదవడం వల్ల తెలియకుండానే మనిషిలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటాయన్నారు.
మరి ఇప్పటివరకూ ఆయన ఎన్ని పుస్తకాలు చదివారో? పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే రెండు లక్షల పుస్తకాలు చదివినట్లు ఓ సందర్భంలో తెలిపారు. మరి మురగదాస్ ఆయన రికార్డును ఇప్పటికే బ్రేక్ చేసేసారా? బ్రేక్ చేస్తారా? అన్నది చూడాలి. ప్రస్తుతం మురగదాస్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా `సికందర్` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.