ఆ స్టార్ డైరెక్టర్ 15 ఏళ్లు వెనక్కి వెళ్లాడా?
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `సికిందర్` రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 March 2025 7:00 AM ISTసల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `సికిందర్` రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బజ్ క్రియేట్ చేయడంలో వెనుక బడిందన్నది కాదనలేని వాస్తవం. టీజర్ , ప్రోమోలతో `సికిందర్` పై ఏ మాత్రం హైప్ క్రియేట్ అవ్వలేదు. ఈ సినిమా స్టోరీ విషయంలోనూ మురగదాస్ ఎక్కడా ఎలాంటి లీక్ అవ్వలేదు. మురగదాస్ మార్క్ చిత్రంగానే ప్రమోట్ అవుతుంది.
సల్మాన్ ఖాన్ ని మరోసారి యాక్షన్ స్టార్ గా ఆవిష్కరించబోతున్నాడని ప్రచార చిత్రాలతో అర్దమవుతుంది. అలాగే కొన్ని రకాల పిక్స్ తో ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనరా? అన్న సందేహం రాక మానలేదు. సినిమాలో సల్మాన్ భార్య పాత్రలో రష్మిక నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టోరీకి యాక్షన్ ని ముడిపెట్టినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మురగదాస్ స్టోరీకి సంబంధించి కొన్ని హింట్స్ అందించారు.
ప్రస్తుతం కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? బంధాలు..బంధావ్యాలు ఎలా ఉంటున్నాయి? అనవసర విషయాలకు పోయి జీవితంలో కోల్పుతున్నది? ఏంటి అన్నది సినిమాలో హైలైట్ అతుందన్నారు. ఈ కథకు పెద్ద స్టార్ హీరో అవసరమని భావించే సల్మాన్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. దీంతో సినిమా స్టోరీపై ఓ ఐడియా వచ్చేసింది. మురగదాస్ ఎలాంటి సినిమా తీసినా? అందులో గొప్ప సందేశం అన్నది కామన్ గా ఉంటుంది.
తాజా లీక్ ను బట్టి మురగదాస్ మళ్లీ ఓ 15 ఏళ్లు వెనక్కి వెళ్లారా? అన్న సందేహం వ్యక్తమవుతుంది. కెరీర్ ఆరంభంలో ఆయన `స్టాలిన్` లాంటి సందేశాత్మక చిత్రం చేసారు. ఆ తర్వాత యాక్షన్ థ్రిల్లర్ కథలపై దృష్టి పెట్టి అదో జోనర్ లో కొనసాగారు. అవి మురగదాస్ కి దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. ఇదే క్రమంలో కొన్ని లవ్ స్టోరీలు స్వయంగా నిర్మించారు.