భర్తకు విడాకులిచ్చిన ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్!
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భాను నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Nov 2024 12:04 PM GMTప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భాను నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరికొన్ని నెలల్లో 30వ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవాల్సిన సమయంలో, ఉన్నట్టుండి విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించడం అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రెహ్మాన్ దగ్గర పనిచేస్తున్న ఆయన లేడీ అసిస్టెంట్ కూడా విడాకులు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
రెహమాన్ దగ్గర అనేక సినిమాలకు బాస్ గిటారిస్ట్ (బాసిస్ట్)గా వర్క్ చేసిన మోహిని డే తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లుగా తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించింది. భర్తతో వైవాహిక బంధానికి స్వస్తి పలికినప్పటికీ, ప్రొఫెషనల్ గా అతనితో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తానని మోహిని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. రెహమాన్ డివోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలో, ఆయన అసిస్టెంట్ కూడా విడాకులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రెహ్మాన్ - మోహిని డే ఇద్దరూ ఒకేరోజు వేర్వేరుగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటనలు చేయడం యాదృచ్చికంగా జరిగిందా లేదా? ఈ రెండు విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ఆరాలు తీస్తున్నారు. గురువు దారిలోనే శిష్యురాలు నడుస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరి ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
1995లో పెళ్లిచేసుకున్న ఏఆర్ రెహమాన్, సైరా బాను.. తమ 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, వాళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఇబ్బందులు.. పెద్ద అంతరాన్ని సృష్టించాయని, అందుకే విడిపోయాలనే నిర్ణయం తీసుకున్నారని వారి లాయర్ వందనా షా తెలిపారు. రెహమాన్-సైరాల విడాకులపైన వారి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీనూ, అమీన్ సోషల్ మీడియాలో స్పందించారు. తల్లిదండ్రుల ప్రైవసీని గౌరవించాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నామని పేర్కొన్నారు.
ఏఆర్ రెహమాన్ కంటే ముందు ఆయన మేనల్లుడు, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ జీవీ ప్రకాష్ కూడా తన భార్యకు విడాకులిచ్చాడు. సింగర్ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జీవీ.. 11 ఏళ్లు కాపురం చేసిన తర్వాత రీసెంట్ గా విడిపోతున్నట్లు ప్రకటించాడు. అంతకముందు సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ కూడా తన భార్యకు డివోర్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కోలీవుడ్ కు చెందిన ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు విడాకులతో తమ వివాహ బంధాన్ని బ్రేక్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.