Begin typing your search above and press return to search.

RC16: రెహమాన్ బ్రేక్ ఇచ్చినా నష్టమేమీ లేదు

ఆస్కార్ కూడా ఆయనకు సెల్యూట్ చేసింది. అంతగా గుర్తింపు పొందిన రెహమాన్ ఈమధ్య విడాకుల విషయంలో ఉహించని విధంగా వార్తల్లో నిలుస్తున్నారు

By:  Tupaki Desk   |   7 Dec 2024 1:30 PM GMT
RC16: రెహమాన్ బ్రేక్ ఇచ్చినా నష్టమేమీ లేదు
X

సినీ ఇండస్ట్రీలో ఏఆర్ రెహమాన్ సృష్టించిన మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పెద్దగా కాంట్రవర్సీలలో కూడా నిలవని ఆయన అందరితోను కూల్ గా మాట్లాడుతూ నవ్వుతూ కనిపించే వారు. ఇక రెహమాన్ దేశవిదేశాల్లో కూడా క్రేజ్ అందుకున్నారు. ఆస్కార్ కూడా ఆయనకు సెల్యూట్ చేసింది. అంతగా గుర్తింపు పొందిన రెహమాన్ ఈమధ్య విడాకుల విషయంలో ఉహించని విధంగా వార్తల్లో నిలుస్తున్నారు.

ఆయన సతీమణి నుంచి విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు చెప్పిన రెహమాన్ అందరికి షాక్ ఇచ్చాడు. అంతే కాకుండా తాజాగా ఆయన సంగీత బాధ్యతల నుండి ఒక ఏడాది విరామం తీసుకుంటున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్తలు వ్యక్తిగత జీవితంలోని సమస్యల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఈ విషయాలు నిజమా కాదా అనే అనుమానాలు కన్ఫ్యూజ్ చేస్తుండగా రెహమాన్ కూతురు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

ముఖ్యంగా రామ్ చరణ్ తదుపరి చిత్రం, బుచ్చి బాబు సాన దర్శకత్వంలో తెరకెక్కనున్న RC 16పై ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్, బుచ్చి బాబు కలయికలో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో రెహమాన్ బిజీగా లేకపోవడం అనేక సందేహాలకు దారితీస్తోందనే రూమర్స్ వచ్చాయి.

ఇక ఫైనల్ గా ఈ విషయం పట్ల రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “ఇలాంటి అసత్యమైన వార్తలను వ్యాప్తి చేయడం ఆపండి,” అంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధమైన పుకార్లు రెహమాన్ యొక్క వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో రెహమాన్ RC కి దూరమయ్యారు అనే కామెంట్స్ అబద్ధమని తేలిపోయింది. అంతే కాకుండా రెహమాన్ ఇప్పటికే మూడు ట్యూన్స్ సిద్ధం చేశారు. వాటికి దర్శకుడు బుచ్చిబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

రెహమాన్ సాంగ్స్ వర్క్ అయితే దాదాపు ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. మరో సాంగ్ విషయంలో ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకోలేదు. ఇక సినిమా షూటింగ్ ఫినిష్ అయిన అనంతరం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మళ్ళీ బిజీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు రెహమాన్ బ్రేక్ తీసుకున్నా వచ్చిన నష్టమేమీ లేదు. సినిమా షూటింగ్ కు ఎలాగూ ఏడాది సమయం పడుతుంది. ఇక RC16 టీమ్ అయితే రెహమాన్ వర్క్ పట్ల కాన్ఫిడెన్స్ గానే ఉంది. దర్శకుడు బుచ్చిబాబు దేవిశ్రీప్రసాద్ ను కాదని మరి రెహమాన్ ను తెచ్చుకున్నాడు. ఇప్పటికే రెమ్యునరేషన్ కూడా పూర్తిగా అందుకున్నట్లు టాక్. కాబట్టి ప్రాజెక్టును వర్క్ విషయంలో లేటయ్యే అవకాశం లేదని చెప్పవచ్చు.