విడాకులు ప్రకటించిన AR రెహమాన్ భార్య
ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఖతీజా - రహీమా, అమీన్ రెహమాన్ అనే కొడుకు ఉన్నారు.
By: Tupaki Desk | 19 Nov 2024 5:31 PM GMTఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి ఆమె స్వరమాంత్రికుడి నుండి విడిపోతున్నట్లు ధృవీకరిస్తూ పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ జంట 29ఏళ్ల సంసార జీవనం తర్వాత బ్రేకప్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యపరిచింది. రెహమాన్ అభిమానులకు నిజంగా ఇది ఒక షాకింగ్ వార్త. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఖతీజా - రహీమా, అమీన్ రెహమాన్ అనే కొడుకు ఉన్నారు.
జాతీయ మీడియా `ఇండియా టుడే`కి ఇచ్చిన ఒక ప్రకటనలో పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత, శ్రీమతి సైరా భాను తన భర్త A R. రెహమాన్ నుండి విడిపోవాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. వారి సంబంధంలో ముఖ్యమైన భావోద్వేగ ఒత్తిడి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఒకరిపై ఒకరికి ఘాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ కొన్ని ఉద్రిక్తతలు, కష్టాలు తమ మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని తాము కనుగొన్నారు. కలతలను తొలగించి కలిపేందుకు ప్రయత్నాలు జరిగినా అవేవీ సఫలం కాలేదు. బాధ, వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీమతి సైరా భాను అన్నారు. తన జీవితంలోని ఈ కష్టమైన అధ్యాయాన్ని కొనసాగిస్తున్నందున.. ఈ సవాళ్ల సమయంలో ప్రజల నుండి గోప్యతను కోరారు.
రెహమాన్ 1995లో సైరా భానును వివాహం చేసుకున్నారు. సిమి గరేవాల్తో చాటింగ్ సెషన్ లో రెహమాన్ మాట్లాడుతూ.. తన తల్లి తన పెళ్లిని నిర్ణయించినట్లు వెల్లడించాడు. తనకు పెళ్లికూతురును వెతుక్కోవడానికి సమయం లేదని అందువల్ల పెద్దలు కుదిర్చిన వివాహాన్ని ఎంచుకున్నానని ఒప్పుకున్నాడు. బొంబాయి.. రంగీలా లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో పెళ్లీడు వచ్చింది. 29వయసు. పిల్లను వెతుక్కో అని అమ్మకు చెప్పాను అని రెహమాన్ అన్నారు. తన మ్యూజిక్ కెరీర్ కి ఇబ్బంది కలిగించని సింపుల్ అమ్మాయి కావాలని కోరుకున్నట్టు రెహమాన్ తెలిపారు.