Begin typing your search above and press return to search.

బుచ్చిబాబు క‌థ‌పై రెహ‌మాన్ రియాక్ష‌న్ ఇలా!

తాజాగా ఈ సినిమా గురించి బుచ్చిబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. మెగా అభిమానులు..రెహ‌మాన్ అభిమానుల మెచ్చే అప్ డేట్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   26 Aug 2023 7:23 PM GMT
బుచ్చిబాబు క‌థ‌పై రెహ‌మాన్ రియాక్ష‌న్ ఇలా!
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ సీ 16 లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ఏ. ఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. రెహ‌మాన్ ఎంట్రీతో సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. ఈ కాంబినేష‌న్ ఏమాత్రం ఊహించ‌న‌ది. బుచ్చి బాబు రెండ‌వ చిత్ర‌మే చ‌ర‌ణ్ తో చేయ‌డం...వాళ్లిద్ద‌ర‌కి తోడుగా రెహ‌మాన్ కూడా రంగంలోకి దిగ‌డం అన్న‌ది క‌నీసం ఊహ‌కు రాలేదు.

అనుకోకుండా ఈ కాంబినేష‌న్ సెట్ అయింది. తాజాగా ఈ సినిమా గురించి బుచ్చిబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. మెగా అభిమానులు..రెహ‌మాన్ అభిమానుల మెచ్చే అప్ డేట్ ఇచ్చారు. 'సినిమా రా అండ్ ర‌స్టిక్ గా ఉంటుంది. నేను క‌థ రాసుకుంటోన్న స‌మ‌యంలోనే సినిమాకి రెహాన్ సంగీతం అందిస్తే బాగుంటుంద‌ని అనుకున్నాను. ఆయ‌న్ని సంప్ర‌దించి క‌థ చెప్ప‌గానే వెంట‌నే ఒకే చేసారు. ఆయ‌న ఒప్పుకుంటారా? లేదా? అన్న సందేహం ఉండేది.

కానీ నా క‌థ ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా స్టోరీలు విన్నా. కానీ ఇలాఒంటి క‌థ విన‌లేదు. క‌చ్చితంగా క‌లిసి ప‌నిచేద్దామ‌న్నారు. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. రెహ‌మాన్ ఎంట్రీతో సినిమా స్థాయి మారింది. ఈ సినిమా షూటింగ్ జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మ‌వుతుంది. చాలా మంది స్పోర్స్ట్ డ్రామా అనుకుంటున్నారు. కానీ వాళ్లంద‌రికీ అంచ‌నాల‌కు మించి ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ కోసం నాలుగేళ్ల‌గా ప‌నిచేస్తున్నా' అని అన్నారు. అలాగే ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజయ్ సేతుప‌తి విల‌న్ గా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఆయ‌న కూడా అధికారికం ఎంట్రీ ఇస్తే ఆర్ సీ 16 అంత‌కు మించి ఉంటుంద‌ని ఊహించొచ్చు.

ప్ర‌స్తుతం బుచ్చి బాబు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నారు. చ‌ర‌ణ్- శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'గేమ్ ఛేంజ‌ర్' లో న‌టిస్తున్నారు. బుచ్చిబాబు వివ‌ర‌ణ‌తో గేమ్ ఛేంజ‌ర్ ఈ ఏడాది చివ‌ర‌క‌ల్లా పూర్తి కానుంద‌ని తెలుస్తోంది.