సూపర్ ఉమెన్ 'ఇంద్రాణి' మూవీ.. ఈ విషయాలు మీకు తెలుసా?
అయితే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో పలు కల్పిత అంశాలు చేర్చినట్లు స్టీఫెన్ పల్లం తెలిపారు.
By: Tupaki Desk | 14 Jun 2024 8:25 AM GMTఇండియన్ సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తెలుగు మూవీ ఇంద్రాణి. యానియా, అంకిత, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను స్టీఫెన్ పల్లం దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. ట్రైలర్ ద్వారా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ.. నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వందేళ్ల తర్వాత ఉండే టెక్నాలజీని తెరపై చూపిస్తున్నామని, సినిమా చూసిన ప్రేక్షకులు ఇంద్రాణితో ప్రేమలో పడిపోతారని ఇప్పటికే మేకర్స్ తెలిపారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో పలు కల్పిత అంశాలు చేర్చినట్లు స్టీఫెన్ పల్లం తెలిపారు. వాటిలో వివాదాస్పదమైన అంశాలు కూడా ఉన్నాయని చెప్పారు. సినిమాను కొత్తగా తీసేందుకు రిస్క్ తీసుకున్నట్లు వెల్లడించారు. కాబట్టి ఇంద్రాణి మూవీ చూసే ముందు లేదా చూసిన తర్వాత పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సినీ ప్రియులను స్టీఫెన్ కోరారు. వాటిని పాయింట్ల రూపంలో వివరించారు. అవేంటంటే?
భారత భూభాగాలపై శత్రువులు సర్జికల్ స్ట్రైక్స్ కు పాల్పడితే ఏం జరుగుతుందనే అంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతోంది. ఇండియా అందుకు సిద్ధంగా ఉందా లేదా అనే అంశం కూడా ఉంటుంది. ఈ విషయంలో సినీ ప్రియులు.. తమ మనోభావాలు దెబ్బతినే విధంగా కాకుండా కల్పిత అంశంగా పరిగణించాలని మేకర్స్ కోరారు. మూవీలో డెస్టినీ (విధి) అర్థమవడానికి సినిమాలో స్మోకీ గోస్ట్ ఎఫెక్ట్ ను ఉపయోగించామని తెలిపారు.
సినిమాలో దివ్యాంగ న్యూస్ యాంకర్ వల్ల గ్రౌండ్ రిపోర్టర్ విసుగు చెందుతాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ ఉంటాయి. అవి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే పెట్టామని, మీడియాను కించపరిచే విధంగా కాదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. టైమ్ ట్రావెల్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా అర్ధమవ్వడానికి.. ప్రతి సీన్ లో డేట్ అండ్ టైమ్ ను మెన్షన్ చేశామని తెలిపారు. కాబట్టి సినిమా చూస్తూ వాటిపై దృష్టి పెట్టాలని మేకర్స్ చెప్పారు.
సినిమాలో కొన్ని సన్నివేశాల్లో పలు పాత్రల మధ్య చాలా తక్కువ డైలాగులు ఉంటాయి. కానీ వాటిలో కావాల్సిన సమాచారం ఉంటుందని, మిస్ కావద్దని సూచించారు మేకర్స్. అప్పుడే స్టోరీకి కనెక్ట్ అవుతారని తెలిపారు. ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని, కాబట్టి దృష్టి మరల్చకుండా మూవీని ఆస్వాదించాలని కోరారు. రోబో షాట్స్ ను యాడ్ చేశామని, వాటిని కూడా ఎంజాయ్ చేయాలని తెలిపారు స్టీఫెన్ పల్లం.
సినిమా స్టార్టింగ్ లో యాక్టర్ సాయికుమార్ వాయిస్ ఓవర్ తో పాటు ఇంటర్వెల్ తర్వాత బిగినింగ్ సీన్ అస్సలు అవ్వకండని స్టీఫెన్ పల్లం కోరారు. సినిమా ఇంకా చూడకపోతే ఈ విషయాలను గుర్తుపెట్టుకుని వెళ్లాలని సూచించారు. వెళ్లి వచ్చి ఉంటే వీటి ద్వారా డౌట్స్ క్లియర్ చేసుకోవాలని చెప్పారు. మొత్తానికి స్టీఫెన్ పల్లం.. ఈ విధంగా ఆడియన్స్ కు సినిమాలోని అంశాలపై క్లారిటీ ఇవ్వడం బాగుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.