ప్రభాస్‌పై జోకర్ కామెంట్.. అర్షద్ వార్షి వివరణ
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ `కల్కి 2898 AD`లో ప్రభాస్ నటనను సమీక్షించిన తర్వాత అర్షద్ వార్షి పెను వివాదానికి కేంద్రంగా నిలిచాడు.
By: Tupaki Desk | 29 Sep 2024 6:01 AM GMTపాన్ ఇండియా బ్లాక్ బస్టర్ `కల్కి 2898 AD`లో ప్రభాస్ నటనను సమీక్షించిన తర్వాత అర్షద్ వార్షి పెను వివాదానికి కేంద్రంగా నిలిచాడు. ప్రభాస్ పాత్రను `జోకర్` అని కామెంట్ చేసాడు. ఈ ఒక్క కామెంట్‌తో అర్షద్ వార్షీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులకు టార్టెట్‌గా మారాడు. అతడిపై అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
చాలామంది టాలీవుడ్ యువహీరోలు ప్రభాస్‌ని అంత పెద్ద మాట అన్నందుకు అర్షద్ వార్షీని కెరీర్ చక్కదిద్దుకోవాల్సిందిగా హుందాగా సూచించారు. కానీ ఎవరూ వార్షీలాగా దిగజారలేదు. ప్రభాస్ పై కామెంట్ దక్షిణాది చిత్ర పరిశ్రమలోని ఇతర స్టార్లలోను తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఆ తర్వాత అర్షద్ వార్షీ ఎంతగా వివరణ ఇవ్వాలని ప్రయత్నించినా ఎవరూ ఖాతారు చేయలేదు. ఇటీవల మరోసారి అవార్డు ఫంక్షన్‌లో అర్షద్ వార్షి ప్రభాస్ గురించి మాట్లాడాక..తనపై ఆన్‌లైన్ ఎటాక్స్ గురించి మౌనం వీడాడు.
ప్రభాస్‌ని ఆ లెవల్లో పొగిడాడు:
అర్షద్ తన వ్యాఖ్యలు కల్కి 2898 ADలో ప్రభాస్ పోషించిన `భైరవ` పాత్ర గురించి.. వ్యక్తి గురించి కాదు! అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అంతేకాదు ప్రభాస్‌ను `తెలివైన నటుడు` అని పేర్కొన్నాడు. ఈరోజుల్లో ప్రజలు సౌండింగ్‌ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారని అన్నారు. ప్రతి ఒక్కరికీ వారి సొంత దృక్కోణం ఉంటుంది. ప్రజలు శబ్దాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. నేను పాత్ర గురించి మాట్లాడాను.. వ్యక్తి గురించి కాదు. అతడు అద్భుతమైన నటుడు.. తనను తాను మళ్లీ మళ్లీ నిరూపించుకున్నాడు. దాని గురించి మాకు తెలుసు. మంచి నటుడికి చెడ్డ పాత్ర ఇది. ప్రేక్షకుల కోణంలో ఇది హృదయ విదారకంగా ఉంది``అని మరో కామెంట్ చేసాడు.
గత నెలలో అన్‌ఫిల్టర్డ్ బై సామ్‌దీష్ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో అర్షద్ మాట్లాడుతూ తాను చివరిగా చూసిన బ్యాడ్ ఫిల్మ్ పేరు చెప్పమని అడిగారు. అది `కల్కి 2898 AD` అని చెప్పాడు. పాన్-ఇండియా సినిమాలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటన గురించి అర్షద్ ప్రశంసించాడు.. ప్రభాస్ `జోకర్` లాగా ఉన్నందుకు బాధగా ఉందని చెప్పాడు. అతడి కామెంట్ పై నాని, సుధీర్ బాబు, దర్శకుడు అజయ్ భూపతి సహా టాలీవుడ్ ప్రముఖులు అర్షద్ మాట్లాడిన తీరు సరి కాదని.. మంచిగా మాట్లాడి ఉంటే బావుండేదని సూచించారు.
మనమంతా ఒకటే సోదరా:
అన్ని భాషల స్టార్లు కలిసి పని చేయడం ఆహ్వానించదగిన పరిణామమని అర్షద్ ఇదే ఇంటర్వ్యూలో అన్నాడు. భాషా అడ్డంకులు అస్పష్టంగా మారడం చాలా కాలం క్రితమే జరగాల్సినది. ఎవరైనా బాలీవుడ్ లేదా టాలీవుడ్ వంటి పదాలను ఉపయోగిస్తే నాకు నిజంగా కోపం వస్తుంది.. చాలా మంది ఇలా మాట్లాడితే చాలాసార్లు సరిదిద్దాను.. ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమ అని నేను వారికి చెప్పాను! అని అన్నాడు. మనమంతా కలిసి ఉన్నాము. నేను ఏదో ఒక రోజు సినిమాకు దర్శకత్వం వహించినప్పుడు అందరినీ నటింపజేయాలనుకుంటున్నాను.. అని అన్నాడు. మున్నా భాయ్ 3 గురించి సమావేశాలు జరుగుతున్నాయని కూడా అతడు తెలిపాడు.