Begin typing your search above and press return to search.

ప్రభాస్ పై ఆర్షద్ కామెంట్స్.. యువ హీరో స్ట్రాంగ్ కౌంటర్

ఒక నటుడు మరో నటుడిపై ఈ విధంగా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 Aug 2024 12:31 PM GMT
ప్రభాస్ పై ఆర్షద్ కామెంట్స్.. యువ హీరో స్ట్రాంగ్ కౌంటర్
X

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఇటీవల పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలను సినీ పరిశ్రమలోని ప్రముఖులు, తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఉన్న నటీనటులు తీవ్రంగా ఖండించారు. ఒక నటుడు మరో నటుడిపై ఈ విధంగా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు.


ఇక టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ అర్షద్ వ్యాఖ్యలను ఈ విధంగా ఖండించారు. 'ప్రతిఒక్కరికి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంది. మనకు నచ్చిన/నచ్చని సినిమాలు, నటులపై మన అభిరుచులకు అనుగుణంగా అభిప్రాయాలను వ్యక్తం చేయడం సహజం. కానీ, ఆ అభిప్రాయాన్ని ఎలా వ్యక్తం చేస్తాం అనేది ఎంతో ముఖ్యం. మీరు కూడా అదే పరిశ్రమలో ఉన్నప్పుడు, ఇక్కడ స్థిరపడటానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో తెలిసినప్పుడు, ఆ అభిప్రాయాన్ని ఎలా చెప్పాలి అనేది మీ బాధ్యత.

నిర్మాణాత్మక విమర్శలకు మనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం కానీ "జోకర్" వంటి పదాలు మాత్రం అసలు కరెక్ట్ కాదు. కల్కి భారతీయ సినిమా గర్వించదగ్గ సినిమా. నాగ్ అశ్విన్ అద్భుతమైన సినిమా నిర్మించారు. ప్రభాస్ అన్న భారతీయ సినిమా పెద్ద స్టార్‌లలో ఒకరు. ఆయన వెనుక ఏదో కారణం ఉంది. దాన్ని "ఎక్స్ ఫ్యాక్టర్" అంటారు. ఆయన స్టార్‌డమ్ గురించి చెప్పాలంటే, ఆయన వైఫల్యాలు కూడా మనకు అర్థం కాని స్థాయిలో ఎక్కువ వసూళ్లు తెస్తాయి.

ఆయన కల్కి విజయంలో ఒక బలమైన పాత్ర పోషించారు. ఇవి నిజాలు మాత్రమే, నేను ఫ్యాన్‌బాయ్ కావడాన్ని పక్కన పెడితే కూడా ఆయన అందరికి మంచి మనసున్న హీరో. తెలుగు సినిమాను ఇష్టపడే ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తాం, కానీ చెప్పే విషయం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఒకదానితో ఒకటి పరస్పర గౌరవాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది' అని సిద్ధు తన వివరణ ఇచ్చారు.

అర్షద్ వార్సీ, ‘కల్కి 2898 ఏ.డి’ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు, ప్రభాస్ క్యారెక్టర్‌ను జోకర్‌తో పోల్చడం తదితర అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత, అర్షద్ పై ఫ్యాన్స్ మరింత సీరియస్ కాకముందే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ పెరిగింది. ‘కల్కి 2898 ఏ.డి’ సినిమా, ప్రభాస్, నాగ్ అశ్విన్ హార్డ్ వర్క్ తోనే ప్రపంచవ్యాప్తంగా గొప్ప విజయాన్ని సాధించింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీలో బిగ్ హిట్ గా నిలిచింది. ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మించారు.