Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ పాత్రపై అర్షద్ వార్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు

By:  Tupaki Desk   |   18 Aug 2024 11:57 AM GMT
ప్ర‌భాస్ పాత్రపై అర్షద్ వార్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. ఓ పాడ్ కాస్ట్ వేదిక‌గా అర్ష‌ద్ ప్ర‌భాస్ స‌హా ఆయ‌న అభిమానులు నొచ్చుకునేలా ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇదంతా ప్ర‌భాస్ న‌టించిన `క‌ల్కి 2898` లో అత‌డి పాత్ర గురించే. అర్ష‌ద్ వార్సీ ఏమన్నాడంటే?..

“నేను కల్కి 2898 ADని చూశాను. అది నాకు అస్సలు నచ్చలేదు. ఈ విషయం ప్ర‌భాస్ కి చెప్పడానికి నాకు బాధగానే ఉంది. కానీ మీరు జోకర్ లాగా ఉన్నారు. నేను మ్యాడ్ మాక్స్ తరహాలో ఏదో ఆశించాను. కానీ అదేంటి? అతను` సూటిగా వార్షిద్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడీ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ప్ర‌భాస్ అభిమానులు ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అర్ష‌ద్ వార్షీపై ఎటాకింగ్ దిగారు.

అర్ష‌ద్ వార్సీ ఇంత‌వ‌ర‌కూ అత‌డి కెరీర్ లో ఎక్కువ‌గా పోషించిన పాత్ర‌ల‌న్నీ హాస్య ప్ర‌ధాన‌మైన‌వే. అస‌లైన `జోక‌ర్` అర్షీద్ వార్సీ...మా ప్ర‌భాస్ కాదంటూ మ‌డిప‌డుతున్నారు. అభిమానులు అర్ష‌ద్ ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే? 2023 కామిక్ కాన్ ఈవెంట్‌లో ప్రభాస్ స్వయంగా ఏమ‌న్నాడంటే? `క‌ల్కి 2898`లో త‌న పాత్ర హాస్య న‌టుడిగానే ఉంటుంద‌న్నారు.

నిజానికి ప్ర‌భాస్ పాత్ర స‌ర‌దాగా...హాస్య భ‌రితంగానే ఉంటుంది. సినిమాలో అస‌లైన హీరో ఎవ‌రు అంటే అమితాబ‌చ్చ‌న్ రోల్ మాత్ర‌మే హైలైట్ అవుతుంది. మొద‌టి భాగం మొత్తంలో హీరో అమితాబ‌చ్చ‌న్ అన్న‌దే మెజార్టీ వ‌ర్గం అభిప్రాయం. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ సైతం రిలీజ్ కి ముందే చెప్పేసాడు. ఇందులో హీరో ప్ర‌భాస్ కాదు...అమితాబ్ సార్ అంటూ వ్యాఖ్యానించారు.