Begin typing your search above and press return to search.

ఇండియా కంటే ఆఫ్ఘాన్ బెటర్ - అర్షద్ వార్సీ కామెంట్స్ వైరల్

బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ కొద్ది రోజుల క్రితం ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ వీడియోలో కల్కి సినిమాలోని ప్రభాస్ క్యారెక్టర్ గురించి కాస్తా కించపరిచే విధంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Aug 2024 5:37 AM GMT
ఇండియా కంటే ఆఫ్ఘాన్ బెటర్ - అర్షద్ వార్సీ కామెంట్స్ వైరల్
X

బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ కొద్ది రోజుల క్రితం ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ వీడియోలో కల్కి సినిమాలోని ప్రభాస్ క్యారెక్టర్ గురించి కాస్తా కించపరిచే విధంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. కల్కిలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందంటూ అర్షద్ వార్సీ వాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ సెలబ్రెటీలు, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అర్షద్ వార్సీపై సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. అతని మాటలని తప్పుపడుతున్నారు.

అదే సమయంలో అర్షద్ వార్సీ నిర్మాత బోనీ కపూర్ మీద కూడా కొన్ని విమర్శలు చేశారు. ఈ విమర్శల ద్వారా ఇప్పుడు మీడియా ఫోకస్ అంతా కూడా అర్షద్ వార్సీ మీదనే ఉంది. అర్షద్ వార్సీ ఈ నాలుగేళ్లలో కేవలం రెండు సినిమాలలో మాత్రమే కనిపించాడు. అవి కూడా అంత ఫేమ్ ఉన్న పాత్రలు కాదు. దీంతో ఫేమ్ కోసం అర్షద్ వార్సీ ఈ వ్యాఖ్యలు చేశాడంటూ అతని మీద కూడా కౌంటర్లు పడుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా అర్షద్ వార్సీ 2012లో ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్ట్ మరల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేపు ఉదయం ఆఫ్ఘాన్ అధ్యక్షుడిని కలుస్తున్న. నేను ఆ దేశానికి షిఫ్ట్ అయితే బెటర్ ఏమో. ఇండియా కంటే ఆఫ్ఘానిస్తాన్ సురక్షితం అంటూ అర్షద్ ట్వీట్ చేశారు. దీనిని మరల బయటకి తీసుకొచ్చి అర్షద్ వార్సీకి ఇండియా అంటే ద్వేషం అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

అలాగే అర్షద్ వార్సీ దేశం విడిచి వెళ్ళిపోతే మంచిది అంటూ ట్వీట్ ని కోట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రభాస్ పై వ్యాఖ్యల విషయంలో గాని ప్రస్తుతం జరుగుతోన్న విమర్శలపై అర్షద్ వార్సీ ఇప్పటి వరకు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదు. ప్రభాస్ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని టాలీవుడ్ సెలబ్రెటీ ప్రముఖులు కూడా ఇప్పటికే ట్విటర్ ద్వారా డిమాండ్ చేశారు.

ఏది ఏమైనా ఇప్పుడు అర్షద్ వార్సీ ఓల్డ్ ట్వీట్ తో పాటు ప్రభాస్ పై చేసిన కామెంట్స్ నేపథ్యంలో అతనిపై సోషల్ మీడియాలో ముప్పేట దాడి ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్ సినీ ప్రేమికులు అర్షద్ వార్సీకి సపోర్ట్ గా తిరిగి విమర్శలు చేస్తోన్న కూడా ఆవంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం లేదనే మాట వినిపిస్తోంది.