Begin typing your search above and press return to search.

చ‌ర్య‌కు ప్ర‌తి చ‌ర్య‌..ఇప్పుడేమంటాడో? ఆ గ్రేట్ స్టార్!

ఇక ప్ర‌భాస్ అభిమానులైతే అత‌డిని పెద్ద ఎత్తున ట్రోల్ చేసారు.

By:  Tupaki Desk   |   27 Oct 2024 4:30 PM GMT
చ‌ర్య‌కు ప్ర‌తి చ‌ర్య‌..ఇప్పుడేమంటాడో? ఆ గ్రేట్ స్టార్!
X

పాన్ ఇండియా మెచ్చిన `క‌ల్కి2898` సినిమాలో ప్ర‌భాస్ పాత్ర‌ని బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అందులో ప్ర‌భాస్ పాత్ర ఓ జోక‌ర్ లా ఉంద‌ని ప‌బ్లిక్ గా విమ‌ర్శించాడు. ప్ర‌భాస్ లాంటి హీరో అలాంటి పాత్ర చేయ‌డం ఏంటి? అస‌హ‌నం వ్య‌క్తం చేసాడు. దీంతో అర్ష‌ద్ వార్షి పై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. టాలీవుడ్ అంత ముక్త కంఠ‌గా అత‌డి వ్యాఖ్య‌ల్ని ఖండిచింది. ఇక ప్ర‌భాస్ అభిమానులైతే అత‌డిని పెద్ద ఎత్తున ట్రోల్ చేసారు.

ప్ర‌తిగా అర్ష‌ద్ వార్షీ అభిమానులు కూడా రంగంలోకి దిగి చాలా వ‌ర‌కూ మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో ప్ర‌భాస్ - అర్ష‌ద్ వార్సీ అభిమానుల మ‌ధ్య నెట్టింట పెద్ద యుద్ద‌మే జ‌రిగింది. ఒక‌ర్ని ఒక‌రు దూషించుకున్నారు. నువ్వెంతంటే? నువ్వెంత అనుకున్నారు. అయితే చ‌ర్య‌కు ప్ర‌తి చ‌ర్య అనేది ఒక‌టుంటుంద‌న్న‌ది అంతా గుర్తించాలి. విశ్వ‌సించాలి. తాజాగా అర్ష‌ద్ వార్షీ అండ్ కో ఇప్పుడా ప్ర‌తి చ‌ర్య‌కు గుర‌వుతున్నారు. ఇటీవ‌లే అర్ష‌ద్ వార్షీ న‌టించిన `బండా సింగ్ చౌదరి` రిలీజ్ అయింది.

ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలను వసూళ్లను చేసింది. ఓపెనింగ్ రోజే సినిమా 20 ల‌క్ష‌ల‌కు ప‌రిమితం అవ్వ‌డంతో డిజాస్ట‌ర్ గా తేలిపోయింది. ఆ మ‌రుస‌టి నాటి నుంచి సినిమాకి వ‌ళ్లే ఆడియ‌న్స్ లేరు. చూసిన వాళ్లు ఇదేం సినిమా అని విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ అభిమానులు సీన్ లోకి వ‌చ్చారు. ప్ర‌భాస్ పాత్ర గురించి అన్ని క‌బుర్లు చెప్పిన వార్షీ సినిమాని ఏమ‌ని విమ‌ర్శించాలి.

అర్ష‌ద్ వార్షీ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు ప్రభాస్ సినిమాల సైకిల్ స్టాండ్ కలెక్షన్స్ కంటే కూడా తక్కువగా ఉన్నాయ ని వార్సిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఈట్రోలింగ్ వేడి చూస్తుంటే డార్లింగ్ అభిమానులు ఇప్ప‌ట్లో ఆపేలా లేరు. అదీ సంగ‌తి.