Begin typing your search above and press return to search.

హాలీడే లో మహేష్.. బాధలో ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   28 Dec 2018 10:20 AM GMT
హాలీడే లో మహేష్.. బాధలో ఫ్యాన్స్
X
ఎప్పుడో 2007 సంవత్సరంలో సర్వీస్ ట్యాక్స్ కట్టలేదని ఇప్పుడు జీఎస్టీతో కలిపి స్టార్ హీరో మహేష్ బాబుపై తాజాగా అధికారులు కొరఢా ఝలిపించారు. మొత్తం కలిసి 73 లక్షలు అయ్యాయంటూ... కట్టలేదని మహేష్ బాబు యాక్సిస్ - ఐసీఐసీఐ అకౌంట్లను అటాచ్ చేసుకున్నారు. కోట్లు సంపాదించే మహేష్ బాబు.. ఈ లక్షలు కట్టకపోవడం ఏంటని అందరూ ముక్కున వేలేసుకున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే నిన్నటి నుంచి బాగా హర్ట్ అయ్యారు. తమ హీరోను అవమానించేలా అధికారులు వ్యవహరించారని మండిపడుతున్నారు.

స్టార్ హీరో కావడం.. పన్నులు కట్టకపోవడంతో ఈ వార్త మీడియాలో హైలెట్ అయ్యింది. దీంతో మహేష్ బాబు అభిమానుల్లో ఒకటే కలవరం మొదలైంది. అయితే ఫ్యాన్స్ ఇంత కలవరపడుతుంటే మహేష్ బాబు కానీ, నమ్రత కానీ ఈ విషయంలో ఎందుకు స్పందిచడం లేదనే ప్రశ్న అభిమానుల నుంచి వ్యక్తమైంది. ఆ పన్ను కట్టి ఈ వివాదానికి తెరదించవచ్చు కదా అని అభిమానులు ఆశించారు.

కానీ మహేష్ బాబు ఇక్కడ ఉంటే కదా.. దీనికి వివరణ ఇచ్చేంది. మొన్ననే ‘మహర్షి’ సినిమా షూటింగ్ పూర్తికావడంతో ఈ ఇయర్ ఎండింగ్ కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి మహేష్ బాబు దుబాయ్ పయనమయ్యాడు. అక్కడే ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకోనున్నాడు. మహేష్ బాబు పన్ను కట్టలేదని ఆయన ఖాతాలు జప్తు చేశారని ఫ్యాన్స్ బాధపడుతుంటే.. మహేష్ మాత్రం దుబాయ్ లో హాలిడే ఎంజాయ్ చేస్తుండడం విశేషం. జనవరి 1 తర్వాత మహేష్ ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయి. మరి అప్పుడు ఏం చెప్తారు.? ఈ టాక్స్ కేసును ఎలా ఎదుర్కొంటాడో చూడాలి మరి..