Begin typing your search above and press return to search.

కత్రినాని ఫ్లైట్ ఎక్కనివ్వలేదా!?

By:  Tupaki Desk   |   7 Sep 2016 4:56 AM GMT
కత్రినాని ఫ్లైట్ ఎక్కనివ్వలేదా!?
X
సినిమా తారలు ఫ్లైట్ జర్నీలు చేయడం చాలా కామన్. వాళ్ల మూలంగా ఆ ఫ్లైట్స్ లో జర్నీ చేసే మిగతా వారికి కాసిన్ని ఇబ్బందులు ఇంకా కామన్. కానీ తాజాగా ఎయిరిండియా అధికారులు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. యంగ్ హీరో సిద్ధార్ధ మల్హోత్రాలను ఫ్లైట్ ఎక్కించుకోలేదన్న న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది.

ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ-317లో వీరిద్దరూ సెప్టెంబర్ 5 రాత్రి జర్నీ చేయాల్సి ఉంది. ఫ్లైట్ షెడ్యూల్డ్ టైమ్ రాత్రి 9.40 కాగా.. సరైన సమయానికే కేట్ - సిద్ లు ఎయిర్ పోర్టుకు వచ్చారు.. బోర్డింగ్ పాస్ లు కూడా తీసుకున్నారు. అయితే.. అక్కడి నుంచి ఫ్లైట్ దగ్గరకు మాత్రం రాలేదు. ఎయిరిండియా అధికారులు ఎన్ని సార్లు ఫైనల్ కాల్స్ ఇచ్చినా.. వీరు మాత్రం ఫ్లైట్ దగ్గరకు రాలేదు. ఇంతకీ విమానం ఎక్కుకుండా వీళ్లేం చేస్తున్నారంటే.. డ్యూటీ ఫ్రీ ఏరియాలో ఎంచక్కా తమ లేటెస్ట్ మూవీ 'బార్ బార్ దేఖో' చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

ఇదంతా తెలిసినా 10.45వరకూ ఫ్లైట్ ను నిలిపి ఉంచారు అధికారులు. అప్పటికి కూడా కత్రినా-సిద్ధార్ధలు ఫ్లైట్ ఎక్కకపోవడంతో.. తోటి ప్యాసింజర్స్ కస్సుబుస్సులాడారు. దీంతో వాళ్లు ఎక్కకుండానే ముంబై వెళ్లిపోయింది ఫ్లైట్. అయితే.. అధికారులు మాత్రం వాళ్లను ఎక్కనివ్వకపోవడం ఏం జరగలేదని.. బోర్డింగ్ పాస్ లు జారీ చేశామని.. కానీ వాళ్లే జర్నీ రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుని ఫ్లైట్ ఎక్కలేదని చెప్పారు. ఇది కూడా బార్ బార్ దేఖో ప్రమోషన్ స్టంట్స్ లో ఒక పార్ట్ అయుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.