Begin typing your search above and press return to search.
అప్పుడు కుదర్లే.. ఇప్పుడు అవసరంలే
By: Tupaki Desk | 1 July 2017 6:21 PM GMTఇప్పుడు మన దేశం సినిమా బాగానే పురోగాభివృద్ది చెందింది. ఒక ప్రాంతపు సినిమాలో వేరే ఇండస్ట్రి నటులు వచ్చి నటిస్తున్నారు. హింది వాళ్ళు కొందరు తెలుగులో, మలయాళం, తమిళ్ వేరే అన్ని భాషల సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇక కొంతమంది ఒక అడుగు ముందుకువేసి ఇంటర్నేషనల్ నటులను కూడా తెప్పించి నటింపచేస్తున్నారు. ఈ మధ్య సల్మాన్ ఖాన్ ‘ట్యూబు లైట్’లో కూడా చైనా నటి ‘ఝూ ఝూ’ నటించింది. రిలీజ్ ముందు ప్రచారంకు ఎందుకు రాలేదని మీడియా వాళ్ళు ఈమె పై ఫోకస్ బాగానే పెట్టారు.
ఇండియన్ సినిమాలో మొదటిసారి నటించింది ‘ఝూ ఝూ’ కానీ ప్రచారం సమయంలో సల్మాన్ ఖాన్ మరియు చిత్ర బృందంతో కలిసి ప్రచారం చేయవలిసి ఉన్నా అప్పుడు ఆమె బిజీ షెడ్యూల్ వలన రాలేకపోయిందట. డైరెక్టర్ కబీర్ ఖాన్ అప్పటిలో ఎందుకు రావటం లేదో వివరణ కూడా ఇచ్చాడు. తన నటన అంతా సినిమాలో చూడండి అని చాలా కాన్ఫిడెంట్ గానే చెప్పాడు. నిజమే ఆమె పాత్ర వరకు ఆమె చక్కగానే నటించింది. కాకపోతే సినిమా సల్మాన్ ఖాన్ స్థాయిలో ఆడకపోగా భారీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరి ఇప్పుడు ఈ చైనా బ్యూటీకి రావాలని ఉన్నా సినిమా ఫలితాలు చూసి మనస్తాపం చెంది ఇండియా పర్యాటన విరమించుకుంది అని తెలిసింది. పాపం అప్పుడు కుదరలేదు ఇప్పుడు రావాలి అనుకున్నా అవసరం లేకుండా పోయింది.
ఝూ ఝూ చైనా లో పేరున్న నటే. ట్యూబు లైట్ సినిమా చైనా ఇండియా యుద్దం వలన జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా నిర్మించారు అందుకని ఝూ ఝూ ని ఎంపిక చేసినట్లు చెప్పారు. కాని ఝూ ఝూ కి ఇక్కడ బ్యాడ్ లక్ ఎదురొచ్చింది. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/