Begin typing your search above and press return to search.

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు 10లక్షల మంది

By:  Tupaki Desk   |   31 Oct 2021 5:30 PM GMT
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు 10లక్షల మంది
X
కన్నడ పరిశ్రమలో పవర్ స్టార్ గా అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ మరణం సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. అతంటి అభిమాన నటుడు ఇంత చిన్న వయసులోనే మరణించడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అక్టోబర్ 29న ఉదయం జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పలకూలిపోయాడు పునీత్. గుండెపోటుతోనే మరణించాడని డాక్టర్స్ తేల్చి చెప్పేసారు. గుండెపోటుతో అర్థాంతరంగా కన్నుమూసిన శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహానికి అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పునీత్ రెండో అన్న కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు వినయ్ రాజ్ కుమార్ చేతులమీదుగా అంత్యక్రియలు పూర్తి చేశారు.ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేపట్టింది. దీనికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మంత్రులు, సినీ పరిశ్రమ ప్రముఖులు,తోటి నటీనటులు హాజరయ్యారు.

పునీత్ పార్థీవ దేహం అభిమానుల సందర్శన కోసం కంఠీరవ స్టేడియంలో 36 గంటల పాటు ఉంచారు. ఈరోజు తెల్లవారుజామున వరకు పునీత్ పార్థీవ దేహం కడసారి చూసేందుకు అభిమానులు బారులు తేరారు. రికార్డు స్థాయిలో 10 లక్షల మంది అభిమానులు ఆయనను చూసేందుకు వచ్చినట్టుగా అంచనా వేస్తున్నారు. పునీత్ మరణంతో అభిమానులు ఒక్కసారిగా పోటెత్తడంతో ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున మోహరించి అభిమానులను అదుపు చేశారు.

అంత్యక్రియలు లక్షలాది మంది అభిమానుల సమక్షంలో కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో కొద్దిసేపటి క్రితం పూర్తి అయ్యాయి. కంఠీరవ స్టేడియం నుంచి పునీత్ అంతిమయాత్రను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా జరిగింది. సంప్రదాయ రీతిలో పునీత్ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.

పార్థీవదేహం వద్దకు చేరుకొని గ్లాస్ కవర్ ను తొలగించాలని సీఎం బొమ్మై కోరారు. ఆ వెంటనే కన్నీటి పర్యంతం అయ్యారు. ఆప్యాయంగా పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేశం నుదిటిని రెండు సార్లు ముద్దు పెట్టుకున్నారు. ప్రేమగా తలను నిమిరారు. చెంపలను తడిమారు. చేతులు జోడించి పార్థీవదేహానికి నమస్కరించారు. కన్నీరు పెట్టుకున్నారు.

తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు అంతిమయాత్ర మొదలైంది. ప్రభుత్వ వాహనంలో కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు. వాహనాన్ని పూలతో అలంకరించి అంతిమయాత్రను కొనసాగించారు.బెంగళూరు నగరంలోని ప్రధాన వీధుల గుండా అంతిమయాత్ర సాగింది. అనంతరం కంఠీరవ స్టేడియానికి చేరుకుంది. సీఎం బొమ్మై, పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరై నిర్వహించారు. తండ్రి రాజ్ కుమార్ సమాధికి 125 అడుగులు, తల్లి పార్వతమ్మ సమాధికి 45 అడుగుల దూరంలో పునీత్ పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసింది. అభిమానులు దారిపొడువునా నిలిచి నివాళులర్పించారు.