Begin typing your search above and press return to search.
10 నిమిషాలు 14 భాషల్లో డైలాగ్.. కమల్ కే సాధ్యం
By: Tupaki Desk | 15 Sep 2022 7:33 AM GMTవిక్రమ్ బ్లాక్ బస్టర్ కారణమో లేదా మరేంటో కానీ కమల్ హాసన్ అభిమానులు కోరుకుంటున్న ఇండియన్ 2 సినిమా మళ్లీ మొదలు అయ్యింది. నిర్మాతలకు మరియు దర్శకుడు శంకర్ కి ఉన్న విభేదాలు తొలగిపోయి ఇండియన్ 2 సినిమా పునః ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి.
తాజాగా యూనిట్ సభ్యుల ద్వారా బయటకు వచ్చిన ఒక విషయం సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచేసింది అనడంలో సందేహం లేదు. కమల్ హాసన్ ఒక హై ఓల్టేజ్ సన్నివేశంలో ఏకంగా 10 నిమిషాల డైలాగ్ ను కట్ లేకుండా చెప్పాడట.
కేవలం కమల్ కి మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఆ పది నిమిషాల డైలాగ్ ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
పది నిమిషాల డైలాగ్ ఎలా చెప్పాడు బాబోయ్ అనుకుంటూ ఉంటే.. ఆ పది నిమిషాల డైలాగ్స్ లో ఏకంగా 14 భాషలు ఉంటాయట. ఒకే సారి అది కూడా ఒక్క షాట్ లో 14 భాషలు కలిసి ఉన్న డైలాగ్ ను చెప్పడం కేవలం యూనివర్శిల్ స్టార్ కే చెల్లింది అంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు. ఆ పది నిమిషాల షాట్ ని షూట్ చేసిన సమయంలో యూనిట్ సభ్యులు అంతా అలా చూస్తూ ఉండి పోయారట.
కమల్ హాసన్ ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను సాధించాడు. ఇది మరో అద్భుతమైన రికార్డ్ అనడంలో సందేహం లేదు. నిమిషం కంటిన్యూస్ గా ఉన్న షాట్ లో నటించడం అంటేనే చాలా కష్టం. అలాంటిది పది నిమిషాల షాట్ అది కూడా 14 భాషల్లో డైలాగ్ చెబుతూ నటించడం అంటే మామూలు విషయం కాదు. ఇది వరల్డ్ రికార్డ్ అయినా ఆశ్చర్యం లేదు.
శంకర్ మరియు కమల్ ల కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్ అనే విషయం తెల్సిందే. చాలా సంవత్సరాల తర్వాత సీక్వెల్ వస్తున్నప్పటికి ఈ తరం ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమా గురించి వస్తున్న ప్రతి విషయం ఆసక్తి ని అమాంతం పెంచుతూనే ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.