Begin typing your search above and press return to search.
10 నేషనల్ అవార్డు విన్నర్స్ కలిసి తీశారు
By: Tupaki Desk | 25 Aug 2016 1:30 PM GMTఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా పది మంది నేషనల్ అవార్డులు గెలుచుకున్నవారు.. ఈ సినిమాను తీశారు. ఈ పది మంది కూడానూ 19 నేషనల్ అవార్డులను గెలుచుకున్నారంటే చూస్కోండి. మన తాప్సీ హీరోయిన్ గా వస్తున్న ''పింక్'' సినిమా గురించే ఈ రచ్చంతా. పదండి చూద్దాం.
ఇప్పటికే ఠారెత్తెపోయే ట్రైలర్ తో ఇండియా అంతటా సంచలనం సృష్టించేశారు తాప్సీ అండ్ కో. ముఖ్యంగా తాప్సీ చేసిన క్యారెక్టర్.. బిగ్ బి అమితాబ్ డైలాగులూ.. అబ్బో అదిరిపోయాయ్. ఇక సినిమా టెక్నిల్ టీమ్ విషయానికొస్తే.. కథను రాసి ప్రొడ్యూస్ చేసిన షూజిత్ సర్కార్.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ దర్శకులు. అలాగే ఈ సినిమాను డైరక్ట్ చేసిన అనిరుద్దా రాయ్ కూడా రెండుసార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్నవాడే. అసలు ముందుగా బిగ్ బి ఇప్పటికి నాలుగు నేషనల్ అవార్డ్స్ ను గెలిచారు. సినిమాటోగ్రాఫర్ అవిక్ ముఖోపాద్యాయకు 3 సార్లు నేషనల్ అవార్డ్ వచ్చింది. ప్రొడ్యూసర్ రానీ లహరి - కంపోజర్ షంతను మొయిత్రా - రీ-రికార్డింగ్ ఇంజనీర్ సినోయ్ జోసెఫ్ లకు ఒక్కొక్క అవార్డు ఉంది. అలాగే సౌండ్ డిజైనర్ బిస్వదీప్ ఛటర్జీ - సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ నిహార్ రంజన్ సమాల్ - దింపాకర్ జోజో చకీలకు కూడా నేషనల్ అవార్డులు రెండేసి సార్లు వచ్చాయి. మొత్తంగా ఈ 10 మంది టీముకు 19 నేషనల్ అవార్డులొచ్చాయి. వీరందరూ కలసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూసుకోండి.
భారతీయ స్ర్తీలపై జరుగుతున్న అరాచకాలను కథాంశంగా తీసుకున్న ''పింక్'' సినిమా సెప్టెంబర్ 16న దేశవ్యాప్తంగా విడుదలవుతోంది.