Begin typing your search above and press return to search.
ఆఫ్ సీజన్లోనూ అన్ని సినిమాల రిలీజా?
By: Tupaki Desk | 5 March 2017 6:51 AM GMTమార్చి నెల.. అందులోనూ ఇంటర్మీడియట్ పరీక్షలు. అయినా.. ఈ వారాంతంలో ఏకంగా 9 సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. ఇంతకీ కారణం తెలుసా.. పెద్ద సినిమాల విడుదల సమయంలో థియేటర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న వారంతా ఈ టఫ్ టైంలో సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. నిజానికి ఈ టైంలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ చేయరు. విద్యార్థలు - ఫ్యామిలీస్ కూడా రారన్న ఉద్దేశంతో సినిమాలు రిలీజ్ చేయరు. ఇదే అదనుగా పలు చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి.
ముఖ్యంగా పలు డబ్బింగ్ సినిమాలకు ఇది మంచి ఛాన్సుగా మారింది. తమిళ సీనియర్ యాక్టర్ రెహమాన్ ప్రధాన పాత్రలో నటించిన డబ్బింగ్ మూవీ ‘16’ ఈ గురువారం విడుదలవుతోంది. ఆ మరుసటి రోజు ఎనిమిది చిత్రాలు రిలీజవుతాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దిల్ రాజు రిలీజ్ చేస్తున్న ‘వెళ్లిపోమాకే’. దీనికి దర్శకుడు యూకూబ్ అలీ.. ఆయన ఇదే ఫస్ట్ సినిమా. అందరూ కొత్తవాళ్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి దిల్ రాజ్ కొత్త ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
ఈ ఆఫ్ సీజన్ ను మంచు లక్ష్మి కూడా బాగానే వినియోగించుకుంది. ఆమె నటించిన ‘లక్ష్మీబాంబు’ - అంజలి నటించిన మూవీ ‘చిత్రాంగద’ శుక్రవారమే వచ్చేస్తున్నాయి. సందీప్ కిషన్-రెజీనా జంటగా నటించిన ద్విభాషా చిత్రం ‘నగరం’ కూడా ఆ రోజే విడుదలవుతుంది.
ఇవి చాలవన్నట్లుగా పూర్తిగా అంతా కొత్తవాళ్లే నటించిన ‘ఆకతాయి’ - ‘పిచ్చిగా నచ్చావ్’ అనే సినిమాలు కూడా ఆ రోజే విడుదల కానున్నాయి. ‘మెట్రో’ - ‘నోటుకు పోటు’ అనే డబ్బింగ్ సినిమాలు కూడా ఈ నెల 9కే షెడ్యూల్ అయ్యాయి. పెద్ద చిత్రాల పోటీ లేని సమయంలో వస్తున్న ఈ చిన్న సినిమాలనల్నీ ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తాయో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/