Begin typing your search above and press return to search.

కరణ్ తో బూతు జోక్స్ వేసిన ట్వింకిల్

By:  Tupaki Desk   |   8 Nov 2016 10:30 PM GMT
కరణ్ తో బూతు జోక్స్ వేసిన ట్వింకిల్
X
కరణ్ జోహార్ ఇప్పుడు కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ ని మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా కాఫీ విత్ కరణ్ 5 టెలికాస్ట్ అవుతోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ కపుల్ అక్షయ్ కుమార్.. ట్వింకిల్ ఖన్నా వచ్చారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన టీజర్ ప్రసారం అవుతోంది. సాధారణంగానే ట్వింకిల్ ఖన్నా బాగా జోవియల్. జోక్స్ తో ఓ పుస్తకం రాసేసిన అనుభవం కూడా ఉంది.

ఇప్పుడీ ప్రోగ్రామ్ లో కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు అమ్మడు ఇచ్చిన ఆన్సర్స్ అందరికీ షాక్ కొట్టించాయి. బాలీవుడ్ స్టార్స్ ఖాన్ హీరోలతో పోల్చితే.. అక్షయ్ లో అదనంగా ఏమున్నాయి? అని అడిగాడు కరణ్. దీనికి చాలా సింపుల్ గా 'కొన్ని అంగుళాలు అంతే' అనేసింది ట్వింకిల్. ఆ వెంటనే.. 'అక్షయ్ ను అక్కడ చూడాల్సిన పని లేదు.. నేను చెప్పినది కాలి పొడుగు గురించి' అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆన్ స్క్రీన్ లో ఇలాంటి డబుల్ మీనింగ్ జోకులను ఓ హీరోయిన్..అందులోనూ స్టార్ హీరో భార్య వేయడం నిజంగా షాక్ కొట్టించే విషయమే.

అంతే కాదు.. తామిద్దరం కలిసి బోర్డింగ్ స్కూల్ లో చదువుకున్నపుడు(నిజంగా చదివారంటారా) తన చిన్న పిల్లి గడ్డాన్ని కరణ్ జోహార్ తెగ ఇష్టపడిపోయేవాడని ట్వింకిల్ చెప్పింది. ఈ దెబ్బకి 'నిన్ను 377సార్లు చెంపదెబ్బలు కొట్టాలి' అన్నాడు కరణ్ జోహార్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/