Begin typing your search above and press return to search.
తూ.గో జిల్లాలో సినిమా తీస్తే 100 కోట్ల కలెక్షన్లు గ్యారంటీ..!
By: Tupaki Desk | 2 Jun 2021 2:30 AM GMTతెలుగు రాష్ట్రాలలో సినిమా షూటింగులకు అనువైన ప్రదేశంగా తూర్పుగోదావరి జిల్లాను చెప్పుకొంటారు. గోదావరి తీరం - కోనసీమ అందాలు - రాజమండ్రి పరిసర ప్రాంతాలు - మారేడుమిల్లి అభయారణ్యాలు వంటి ప్రదేశాలలో సినిమాల చిత్రీకరణ చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రముఖ దర్శకులు వంశీ - విశ్వనాథ్ వంటి వారు తాము రూపొందించే ప్రతి సినిమాలోనూ తూ.గో జిల్లా అందాలను చూపిస్తుంటారు. కథానుసారమో సెంటిమెంట్ కోసం ఆ బ్యాగ్రౌండ్ లో సినిమాలు చేస్తుంటారు. అంతేకాదు అక్కడ సినిమా తీస్తే మంచి విజయాన్ని నమోదు చేస్తాయని పలువురు దర్శకులు నమ్ముతుంటారు. దీనిని నిజం చేస్తూ అక్కడ షూటింగ్ జరుపుకున్న చాలా సినిమాలు హిట్ అయ్యాయి.
నవ తరం దర్శకులు కూడా ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సినిమా షూటింగులు ప్లాన్ చేసుకుంటున్నారు. తూ.గో జిల్లాలో షూటింగ్ జరుపుకున్న 'రంగస్థలం' 'ఉప్పెన' 'గీత గోవిందం' ఇలా చాలా సినిమాలు భారీ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. దీంతో ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో సినిమా తీస్తే మాత్రం వంద కోట్లు క్లబ్ లో చేరడం ఖాయమని.. కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. గత సినిమాల రిజల్ట్స్ ని పరిశీలిస్తే చాలా వరకు తూర్పు గోదావరి జిల్లా అచ్చొచ్చిందనే అనుకోవాలి.
కరోనా పరిస్థితులు నేపథ్యంలో గతేడాది నుంచి ఎక్కువ సినిమా షూటింగ్స్ ఇండోర్ లొకేషన్స్ లో మన తెలుగు రాష్టాల్లోనే జరుపుతున్నారు. ఎక్కువగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. అక్కడ గోదావరి అందాల మధ్య ప్రశాంతంగా షూటింగ్ చేసుకోవచ్చని.. అందులోను పెద్దగా తెలియని ప్రాంతాలకు వెళ్తే ఏ ఇబ్బందీ ఉందడని ఫిలిం మేకర్స్ భావిస్తున్నారు. దీని వల్ల నిర్మాతలకు ఖర్చు కూడా కాస్త తగ్గుతోంది. ఇప్పుడు రాబోతున్న పెద్ద సినిమాలు షూట్స్ అన్నీ ఈస్ట్ లోనే ప్లాన్ చేసుకున్నారు. 'ఆచార్య' 'పుష్ప' 'టక్ జగదీష్' 'థాంక్యూ' 'రిపబ్లిక్' 'శ్రీదేవి సోడా సెంటర్' వంటి సినిమాల షూటింగులు తూర్పుగోదావరి జిల్లాలో జరుపుకున్నాయి. లెజండరీ దర్శకుడు మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' సినిమా షూటింగ్ తూ గో జిల్లాలో చేస్తున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు.