Begin typing your search above and press return to search.

రూ.600 చీర కట్టులో వంద కోట్ల హీరోయిన్‌

By:  Tupaki Desk   |   17 Oct 2022 12:31 PM GMT
రూ.600 చీర కట్టులో వంద కోట్ల హీరోయిన్‌
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏం చేసినా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆమె ఇటీవల కోల్కత్తాలో 600 రూపాయలు పెట్టి ఒక చీరను కొనుగోలు చేసిందట. ఆ చీరను తాజాగా కంగనా ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.

స్టైల్ అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని వాడడం కాదని.. చీర కట్టులో కూడా ఇలా సింపుల్ గా తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలి అంటూ కంగనా తనదైన శైలిలో ఇతర స్టార్స్ కి కౌంటర్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియా ద్వారా ఈ ఫోటోని షేర్ చేసి కామెంట్ చేసింది.

మీరు చేసే ప్రతి పని కూడా దేశానికి ఉపయోగపడాలి.. మీరు ప్రాంతీయ వస్తువులను కొనుగోలు చేయడంతో ఎన్నో ప్రాంతీయ కుటుంబాలు లాభపడతాయి. కనుక ఎప్పుడూ కూడా ప్రాంతీయతను ప్రోత్సహించాలి.. అంతే తప్ప విదేశీ మోజులో పడకూడదు జైహింద్ అంటూ కంగనా రనౌత్ పోస్ట్ చేసింది.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటే కంగనా ఈసారి ఈ 600 రూపాయల చీర కట్టులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే వివాదాస్పద సినిమాలో ఈమె నటిస్తోంది.

ఈ ఎమర్జెన్సీ అనే వివాదాస్పద సినిమాను కంగనా తన హోమ్ బ్యానర్లో నిర్మిస్తుంది. సినిమా కాస్త సక్సెస్ అయితే రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టగల బాక్సాఫీస్ స్టామినా ఉన్న కంగనా ఇలా 600 రూపాయల చీర లో కనిపించడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. కంగనా ఏం చేసినా స్పెషల్ అంటూ మరోసారి ఈ విషయం తో నిరూపితమైంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.