Begin typing your search above and press return to search.
KGF -2 ముంబై సర్క్యూట్ లో 100కోట్లు
By: Tupaki Desk | 1 May 2022 7:30 AM GMTKGF - చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ వసూళ్లు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. దేశంలో టాప్ 5లో చోటు దక్కించుకుంది. ఈ సినిమా ఇప్పుడు ముంబై సర్క్యూట్ లో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లలో 4వ స్థానంలో ఉంది. వసూళ్లలో టైగర్ జిందా హైని అధిగమించేందుకు ఇంకెంతో సమయం పట్టదని బాలీవుడ్ మీడియా వెల్లడించింది.
యష్ నటించిన KGF - చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద తిరుగులేని హవా సాగిస్తోంది. కొంతకాలం క్రితం విడుదలైనప్పటి నుండి KGF 2 వసూళ్లలో రోజు గడిచేకొద్దీ అపారమైన వృద్ధి కనిపించింది. ఉరుములతో కూడిన ప్రారంభం తర్వాత ఈ చిత్రం నాలుగో వారాంతంలోనూ వసూళ్లు పెరగడం ఆసక్తికరం. రెండవ వారాంతంలో ట్రెండ్ ను సెట్ చేయడమే గాక.. మొదటి వారంలో ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేసింది. K.G.F - చాప్టర్ 2 ఇప్పుడు ముంబై సర్క్యూట్ లో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లలో 4వ స్థానంలో ఉంది.
ఈ బాక్సాఫీస్ రిపోర్ట్ ని ముంబై సర్క్యూట్ వరకూ పరిశీలిస్తే... కేజీఎఫ్ 2 వంద కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి ఇప్పటికి 107.66 కోట్లు వసూలు చేసింది. KGF - చాప్టర్ 2 ఈ సర్క్యూట్ లో నాల్గవ అత్యధిక ఆల్-టైమ్ టాప్ గ్రాసర్ గా ఉంది. నిజానికి ఈ సినిమా ఇంతకుముందు విడుదలైన పీకే-రూ.105.2 కోట్లు ... దంగల్ 104.22 కోట్లు.. సంజు రూ. 102.39 కోట్లు.. బజరంగీ భాయిజాన్ రూ. 99.34 కోట్లు రికార్డులను బ్రేక్ చేసింది.
అయితే బాహుబలి 2 - ది కన్ క్లూజన్.. తాన్హాజీ - ది అన్‌సంగ్ వారియర్ .. టైగర్ జిందా హై చిత్రాలను అధిగమించలేదు. ఇవన్నీ చార్ట్ లో టాప్ 3లో ఉన్నాయి. అయితే KGF - చాప్టర్ 2 ఇప్పటికీ థియేటర్లలో జోరుగా కొనసాగుతుండటంతో ఈ చిత్రం కలెక్షన్లు త్వరలో సల్మాన్ ఖాన్ చిత్రం టైగర్ జిందా హై రికార్డు(109.08 కోట్లు)ను అధిగమించగలవని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం KGF - చాప్టర్ 2 పై ఇతర సినిమా ప్రభావం ఏదీ లేదు. కొత్తగా విడుదలైన రన్ వే 34 - హీరోపంతి 2 చిత్రాలు కేజీఎఫ్2 పై పెద్దగా ప్రభావితం చూపించలేదని టాక్ వినిపిస్తోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం యష్ నటించిన కేజీఎఫ్ 2 హవా వారాంతంలో ఈద్ రోజున కలెక్షన్లలో మరో స్పైక్ తో వృద్ధిని కొనసాగిస్తుందిని భావిస్తున్నారు.
ముంబై సర్క్యూట్ లోని టాప్ 10 అత్యధిక వసూళ్లు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.
బాహుబలి 2 - ది కన్ క్లూజన్ - రూ. 191.58 కోట్లు
తాన్హాజీ - ది అన్‌సంగ్ వారియర్ - రూ. 136.94 కోట్లు
టైగర్ జిందా హై - రూ. 109.08 కోట్లు
K.G.F - చాప్టర్ 2 - రూ. 107.66 కోట్లు
PK - రూ. 105.2 కోట్లు
దంగల్ - రూ. 104.22 కోట్లు
సంజు - రూ. 102.39 కోట్లు
బజరంగీ భాయిజాన్ - రూ. 99.34 కోట్లు
కబీర్ సింగ్ - రూ. 95.61 కోట్లు
సుల్తాన్ - రూ. 90.35 కోట్లు