Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 100 డేస్ ఆఫ్ లవ్
By: Tupaki Desk | 26 Aug 2016 10:40 AM GMTచిత్రం : ‘100 డేస్ ఆఫ్ లవ్’
నటీనటులు: దుల్కర్ సల్మాన్ - నిత్యా మీనన్ - శేఖర్ మీనన్ - వినీత్ - ప్రవీణ - రాహుల్ మాధవ్ తదితరులు
సంగీతం: గోవింద్ మీనన్
నేపథ్య సంగీతం - బిజిబల్
ఛాయాగ్రహణం: ప్రతీష్ వర్మ
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
నిర్మాత :వెంకటరత్నం
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జీనస్ మహ్మద్
‘ఓకే బంగారం’తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న జంట దుల్కర్ సల్మాన్ - నిత్యా మీనన్. దీని కంటే ముందు వీళ్లిద్దరూ మలయాళంలో కలిసి నటించిన సినిమా ‘100 డేస్ ఆఫ్ లవ్’. మలయాళంలో విడుదలైన ఏడాదిన్నరకు అదే పేరుతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ తో ప్రామిసింగ్ గా కనిపించిన ఈ చిత్రం.. తెరమీద ఏ మేరకు మెప్పించిందో చూద్దాం పదండి.
కథ:
గోపాల్ (దుల్కర్ సల్మాన్) సంపన్న కుటుంబానికి చెందిన వాడే అయినా తల్లిదండ్రుల ఆలోచనలకు తగ్గట్లు జీవితాన్ని సాగించలేక.. వాళ్ల నుంచి దూరంగా వచ్చేసి తనకు నచ్చిన తరహాలో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఓ ఇంగ్లిష్ పత్రికలో ఫీచర్స్ రైటర్ గా పని చేసే గోపాల్ కు కామిక్ కార్టూనిస్టు కావాలన్నది లక్ష్యం. కానీ తన దుందుడుకు స్వభావం వల్ల అప్పటికే ఉన్న ఉద్యోగాన్ని నిలుపుకోవడానికే శ్రమిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు మీద అనుకోకుండా మెరిసి మాయమైన సావిత్రి (నిత్యా మీనన్) మాయలో పడతాడు గోపాల్. తన చేతికి దొరికిన ఆమె కెమెరా పట్టుకుని తన కోసం అన్వేషణ మొదలుపెడతాడు. తర్వాత అనుకోకుండా ఓ సందర్భంలో తనే అతడికి ఎదురవుతుంది. సావిత్రితో తనకు అప్పటికే పరిచయం ఉందని బీకేఎన్ కు అప్పుడే తెలుస్తుంది. అంతే కాక సావిత్రి అప్పటికే మరొకరితో ఎంగేజ్ అయిన విషయం కూడా వెల్లడవుతుంది. ఈ పరిస్థితుల్లో గోపాల్ ఏం చేశాడు.. తను ప్రేమించిన అమ్మాయి మనసు గెలిచాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
బేసిక్ స్టోరీ చూస్తే ‘100 డేస్ ఆఫ్ లవ్’లో కొత్తదనం ఏమీ కనిపించదు. ఇలాంటి ప్రేమకథలు వందల్లో వచ్చాయి. ఐతే లవ్ స్టోరీల్లో కథ కంటే కూడా అందులో ఫీల్ తీసుకురావడం.. ప్రేక్షకుల మనసుల్ని తట్టడం.. ప్రధాన పాత్రలతో యువ ప్రేక్షకులు కనెక్టయ్యేలా చూడటం కీలకమైన విషయాలు. ‘100 డేస్ ఆఫ్ లవ్’ ఆ విషయంలో విజయవంతమైంది. ఇది మంచి ఫీల్ ఉన్న ప్రేమకథ. మన అంచనాలకు తగ్గట్లు సాగుతూనే.. ఆహ్లాదం పంచుతూ.. ఆలోచింపజేస్తూ సాగే ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ‘100 డేస్ ఆఫ్’ లవ్’. కాకపోతే నరేషన్ మరీ స్లోగా అనిపిస్తుంది. కథ మొదలవడానికే చాలా సమయం పడుతుంది. పైగా ఆ కథలో గొప్ప మలుపులేమీ ఉండవు.
గత కొన్నేళ్లలో మలయాళంలో ప్రేమమ్.. బెంగళూరు డేస్ లాంటి అద్భుతమైన ఫీల్ ఉన్న ప్రేమకథలు వచ్చాయి. ‘100 డేస్ ఆఫ్ లవ్’ ఆ తరహాలోనే ఫీల్ తో సాగినా.. ఆసక్తి విషయంలో వాటి స్థాయికి చేరదు. ప్రేమకథలోని ఫీల్ ను అనుభూతిని చెందితే రెండున్నర గంటల ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఇందులోని పాత్రల్ని.. వాటి ఫీలింగ్స్ ని మనసులో నింపుకుని సంతృప్తిగా బయటికి వస్తాం. పాత్రలతో కనెక్ట్ కాలేనపుడు మాత్రం ఇది భారమైన ప్రయాణంలా అనిపిస్తుంది. సినిమాలో అద్భుతం అనిపించే విషయలేమీ లేవు. కానీ సాధారణంగా అనిపిస్తూనే మనసుపై ముద్ర వేసే అంశాలున్నాయి.
‘100 డేస్ ఆఫ్ లవ్’లోని పాత్రలన్నీ కూడా మనకు బాగా పరిచయం ఉన్నట్లుగానే అనిపిస్తాయి. దీని స్టోరీ లైన్.. దాదాపుగా ‘నువ్వు నాకు నచ్చావ్’ను తలపిస్తుంది. పాత్రల్ని సహజంగా తీర్చిదిద్దాడు దర్శకుడు జీనస్ మహ్మద్. సన్నివేశాలు కూడా సహజంగా ఉంటాయి. జీవితంలో ఒరిజినాలిటీ ఉండాలి.. మనకు నచ్చినట్లు జీవితం సాగించడంలో ఉండే ఆనందమే వేరు అనే విషయాల్ని ప్రధాన పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడతను. చివరికి హీరోనే గెలుస్తాడన్నది తెలిసిన విషయమే అయినా.. అతడి ప్రయాణంలో ఎదురయ్యే కష్టాల్ని.. బాధను కూడా ప్రేక్షకులు ఫీలయ్యేలా చేసి.. ఆ పాత్రతో పాటు ప్రయాణం చేసేలా కథనాన్ని నడిపించాడు.
ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ కోసం అన్వేషిస్తూ సాగే క్రమంలో కథ ముందుకే సాగదు. సినిమా మొదలైన గంటకు కానీ కథలో కదలిక ఉండదు. ఇక హీరో హీరోయిన్లకు పరిచయం అయ్యాక తర్వాత ఏం జరగొచ్చు అన్నది గెస్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ చూడముచ్చటైన దుల్కర్-నిత్యల జంట కథనాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆరంభంలో నిత్య ఓసారి మెరిసి మాయమైపోయాక.. తన కోసం ఎప్పుడెప్పుడా అన్నట్లు ఎదురు చూస్తాం. అసలు నిత్య వచ్చాకే కథ ముందుకు కదులుతుంది. ద్వితీయార్ధం పూర్తిగా ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లు సాగుతుంది. ఐతే క్లైమాక్స్ ఏంటో ముందే తెలిసినా.. అప్పటిదాకా కూర్చోబెట్టేలా కథనాన్ని నడిపించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ‘100 డేస్ ఆఫ్ లవ్’ను దుల్కర్-నిత్యాల ‘ఓకే బంగారం’తో పోల్చుకోలేం. అందులోని వేగం ఇందులో కనిపించదు.
నేటివిటీ ఈ సినిమాకు పెద్ద సమస్య కాదు. కథ మన సిటీలోనే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ప్రధాన పాత్రధారులిద్దరూ మనకిప్పటికే పరిచయం కాబట్టి.. కనెక్టయిపోతాం. దుల్కర్-నిత్యల కెమిస్ట్రీ మరోసారి అద్భుతంగా పండింది. ఈ ప్రేమకథలో హాస్యం పాళ్లు తక్కువే. మన కృష్ణుడు మాదిరిగా ఉన్న హీరో ఫ్రెండు పాత్ర సరదాగా సాగుతూ ఓ మోస్తరుగా వినోదం పంచుతుంది. సినిమా విషయంలో ప్రధానంగా చెప్పుకోదగ్గ కంప్లైంట్స్.. కథనం నెమ్మదిగా సాగడం.. కథలో కొత్తదనం లేకపోవడమే. అక్కడక్కడా ఆటోబయోగ్రఫీ చదువుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగతీతలా అనిపిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ‘100 డేస్ ఆఫ్ లవ్’ నెమ్మదిగా సాగే ఫీల్ ఉన్న ప్రేమకథ.
నటీనటులు:
దుల్కర్ సల్మాన్.. నిత్యామీనన్ జంటను చూడటం కనువిందే. ఇద్దరిలో ఎవరికి ఎవరూ తీసిపోరు. పాత్రలకు తగ్గట్లుగా పరిణతితో కూడిన నటనతో కట్టిపడేశారిద్దరూ. ఇద్దరూ నటిస్తున్నట్లు కాకుండా నిజ జీవితంలో ప్రవర్తిస్తున్నట్లే కనిపిస్తారు. ఫలానా సన్నివేశం అని కాకుండా.. ఆద్యంతం ఆకట్టుకుంటారు వీళ్లిద్దరూ. హీరో ఫ్రెండు పాత్రలో బొద్దబ్బాయి శేఖర్ మీనన్ గుర్తుంటాడు. చాలావరకు ఫన్నీగా సాగే ఈ పాత్ర.. చివర్లో ఒక ఎమోషనల్ సీన్ తో మనసు తడి చేస్తుంది. చాన్నాళ్ల తర్వాత కనిపించిన వినీత్.. డబ్బు మదమున్న అబ్బాయిగా రాహుల్ మాధవ్ కూడా ఆ పాత్రలకు సూటయ్యారు.
సాంకేతికవర్గం:
నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా దర్శకుడి ఆలోచనలకు తగ్గట్లు పనిచేశారు. గోవింద్ మీనన్ పాటలు.. బిజిబల్ నేపథ్య సంగీతం మంచి ఫీల్ తో సాగుతాయి. ప్రతీష్ వర్మ ఛాయాగ్రహణం కూడా ఆహ్లాదకరంగా అనిపిస్తుుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. శశాంక్ వెన్నెలకంటి మాటలు ఓకే. దర్శకుడికిది తొలి సినిమానే అయినా అనుభవమున్న దర్శకుడిలా ప్రేమకథను పరిణతితో డీల్ చేశాడు. నటీనటులు - సాంకేతిక నిపుణుల నుంచి చక్కటి పనితనం రాబట్టుకున్నాడు. నరేషన్ మాత్రం మరీ స్లో.
చివరగా: 100 డేస్ ఆఫ్ లవ్.. ఫీల్ ఉంది.. పేస్ లేదు.
రేటింగ్- 2.75/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre