Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ విగ్రహాలతో ఫ్యాన్స్ కు గేలం
By: Tupaki Desk | 7 Jan 2019 6:10 AM GMTఎల్లుండి విడుదల కానున్న ఎన్టీఆర్ కథానాయకుడు కోసం థియేటర్లు సిద్ధమయ్యాయి. సంక్రాంతి రేస్ లో మొదటి సినిమా కాబట్టి ఎక్కువ థియేటర్లలో వేసే అవకాశం దొరకడంతో ఓపెనింగ్స్ పరంగా రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇకపోతే మరో ఆసక్తికరమైన వార్త ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కలిపి 100 పైగా ఎంపిక చేసిన థియేటర్లలో 100 ఎన్టీఆర్ విగ్రహాలు పెడతారట. అంటే ఎమోషనల్ గా అభిమానులకు వీటి రూపంలో గేలం వేయొచ్చన్న మాట.
దాదాపుగా చాలా ఊళ్లల్లో ఎన్టీఆర్ విగ్రహాలు పలు కూడళ్లలో ఉండటం సర్వ సాధారణం. అయితే ఆయన కథను ఆధారంగా చేసుకుని మొదటిసారి వస్తున్న బయోపిక్ కాబట్టి అంచనాలతో పాటు హైప్ అధికంగా ఉంది. పైగా టిడిపి అధికారంలో ఉంది కాబట్టి వ్యవస్థాపకుడి సినిమాగా కార్యకర్తలు చలో కూడా పొలోమని సినిమాకు క్యూ కట్టడం ఖాయం. అయితే ఈ విగ్రహాల సెంటిమెంట్ ఎంతమేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం అమ్మోరు రిలీజైనప్పుడు ఇలాగే దేవతా విగ్రహాలు సినిమా హాళ్ల బయట పెట్టి పూజలు చేసేవారు.
ఇటీవలే శ్రీనివాస కళ్యాణం కోసం దిల్ రాజు కొన్ని థియేటర్లను పెళ్లి మంటపాలుగా డెకరేట్ చేయించి సిబ్బందితో సాంప్రదాయ దుస్తులు వేయించారు. సో పాతదే అయినా ఇప్పటి ట్రెండ్ లో ఇదో కొత్త రకం స్ట్రాటజీ. అయితే థియేటర్ల వద్ద ఎన్టీఆర్ విగ్రహాలకు పూజా నైవేద్యాలు పూల హారాలు వగైరా నిత్య కైంకర్యాలు ఉంటాయని వేరే చెప్పాలా . 9న తెల్లవారుఝామున బెనిఫిట్ షోలతో సందడి మొదలుపెట్టనున్న ఎన్టీఆర్ 72 కోట్ల బిజినెస్ తో భారీ అంచనాల మధ్య వస్తోంది