Begin typing your search above and press return to search.

సుక్కు త‌మిళ్ సినిమా పోస్ట‌రొచ్చింది

By:  Tupaki Desk   |   15 July 2017 10:06 AM GMT
సుక్కు త‌మిళ్ సినిమా పోస్ట‌రొచ్చింది
X
ప్రేమ‌క‌థ‌ల్ని తీయ‌డంలో సుకుమార్ స్టైలే వేరు. ఆర్య త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయిలో మాట్లాడుకొనేలా `100%ల‌వ్‌` తెర‌కెక్కించి విజ‌యాన్ని సొంతం చేసుకొన్నాడు సుక్కు. గీతా ఆర్ట్స్ నిర్మించిన చిత్ర‌మైనా రైట్స్ మాత్రం తానే సొంతం చేసుకొన్నాడు. తెలుగులో ఘ‌న‌విజ‌యం సాధించిన ఆ సినిమాని హిందీలో సొంతంగా తీయాల‌ని అప్ప‌ట్లోనే ప్ర‌య‌త్నాలు చేశారాయ‌న‌. మ‌రి ఏమైందోకానీ... ఆ ప్ర‌య‌త్నాన్ని మానుకొన్నాడు. ఆ త‌ర్వాత త‌న సినిమాల‌తో బిజీ అయిపోయాడు సుకుమార్‌. చాలా రోజుల త‌ర్వాత ఇప్పుడు త‌మిళంలో రీమేక్ చేయిస్తున్నాడు. త‌న శిష్యుడైన చంద్ర‌మౌళి అనే ద‌ర్శ‌కుడికే త‌మిళ రీమేక్ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పాడు. జి.వి.ప్ర‌కాష్‌కుమార్‌ - లావ‌ణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

తెలుగులో నాగ‌చైత‌న్య‌ - త‌మ‌న్నా క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే. త‌మిళంలో జీవి - లావ‌ణ్య అయితేనే బాగుంటార‌ని వాళ్ల‌ని ఎంపిక చేసుకొన్నారు. అక్క‌డ `100% కాద‌ల్‌` పేరుతో తెర‌కెక్కుతున్న ఆ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్ తాజాగా బ‌య‌టికొచ్చింది. హీరోహీరోయిన్ల కాలి వేళ్ల‌తో కూడిన ఆ పోస్ట‌ర్ చాలా బాగుంది. సినిమా చూసేశాం కాబ‌ట్టి మ‌న‌కు ఆ పోస్ట‌ర్ చూసేసిన‌ట్టుగానే ఉంది. కానీ త‌మిళ్ ప్రేక్ష‌కులు మాత్రం ఫ్రెష్‌ గా ఫీల‌వుతారు. త‌మిళంలో ఈ సినిమా మంచి రిజ‌ల్ట్‌ ని తీసుకొస్తే మాత్రం హిందీలోనూ రీమేక్ చేయ‌డం ఖాయమంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు.