Begin typing your search above and press return to search.

లండన్ బ్యాక్ డ్రాపా? 50% దెబ్బే

By:  Tupaki Desk   |   1 July 2017 6:01 AM GMT
లండన్ బ్యాక్ డ్రాపా? 50% దెబ్బే
X
సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య- తమన్నా జంటగా రూపొందిన మూవీ 100% లవ్. టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని.. ఇప్పుడు తమిళ్ లో కంపోజర్ కం హీరో అయిన జీవీ ప్రకాష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. బోలెడంత మందిని పరిశీలించిన తర్వాత.. చివరకు హీరోయిన్ గా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసుకున్న యూనిట్.. అగ్రిమెంట్స్ కూడా సైన్ చేయించేసుకున్నారు.

ఇదంతా ఓకే కానీ.. ఈ మూవీని ఇప్పుడు లండన్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేస్తున్నారట. మొత్తం సినిమా అంతా అక్కడే ఉంటుందట. అసలే ఇది బావా మరదళ్ల మధ్య జరిగే ప్రేమ కథ. దీనికి ఎడ్యుకేషన్ తో పాటు ఎమోషన్స్ మిక్స్ చేసి తీసిన మూవీ. దీన్ని తీసుకెళ్లి లండన్ లో షూటింగ్ చేయడం అంటే.. విజువల్స్ పరంగాను.. కాలేజ్ లను గ్రాండ్ గా రిచ్ గా చూపించచ్చేమో కానీ.. ఇండియన్ నేటివిటీ కనిపిస్తుందా అన్నదే అసలు సిసలైన పాయింట్. చదువులో ఒకరితో ఒకరు పోటీ పడ్డం అనే పాయింట్ బాగానే ఉంటుందేమో కానీ.. సినిమాకు అసలు సోల్ అది కాదు. దటీజ్ మహాలక్ష్మి అని హీరోను మెప్పించడం వెనక.. చాలానే ఫ్యామిలీ కథ నడుస్తుంది. దీన్ని లండన్ నేటివిటీతో కలిపి తీస్తే.. అసలు సెట్టవుతుందా?

పల్లెటూరి నుండి సిటీకి వచ్చిన అమ్మాయిలా హీరోయిన్ ఉంటే బాగుంటుంది కాని.. ఇండియా నుండి లండన్ వెళ్ళి అమ్మడు అక్కడ వెర్రి మొహంలో కనిపిస్తే.. అసలు కిక్కే ఉండదనేది సినిమా లవర్స్ ఫీలింగ్. రీమేక్ అన్నాక మార్పులు చేర్పులు ఉంటాయని ఊహించడం సహజమే కానీ.. అసలు పాయింట్ ని మరీ ఇంతగా మార్చేస్తే.. ఈ 100% కాదల్ 50% ఎదురు దెబ్బలు తినే ఛాన్సుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/