Begin typing your search above and press return to search.
సుక్కు దేవి ఊరమాస్ లెక్కలు.. 20 రోజుల్లో 100 మిలియన్స్
By: Tupaki Desk | 1 Jan 2022 12:30 AM GMTసుకుమార్.. దేవి శ్రీ ప్రసాద్ ల కాంబోలో వచ్చిన సినిమాలన్నీ కూడా మ్యూజికల్ హిట్ ను దక్కించుకున్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఐటెం సాంగ్స్ ఎంతటి పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ అంటే అమలాపురం మొదలుకుని రింగ రింగా.. మొన్న వచ్చిన ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ వరకు అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి. గతంలో వచ్చిన ఐటెం సాంగ్స్ తో పోల్చితే ఊ అంటావా మావ పాట మరో రేంజ్ సక్సెస్ అనుకోవచ్చు. పుష్ప సినిమాకు ఉన్న బజ్.. అల్లు అర్జున్ మాస్ లు.. సమంత ఈ పాటను చేయడం ఎప్పటిలాగే దేవి తో సుకుమార్ మాస్ ట్యూన్ చేయడం వంటి కారణాలతో ఊ అంటావా మావ సాంగ్ మాస్ లో ఊర మాస్ రెస్పాన్స్ ను దక్కించుకుంది.
కేవలం 20 రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ ను ఈ పాట దక్కించుకుంది. రోజుకు అయిదు మిలియన్ ల ప్లేస్ కేవలం యూట్యూబ్ లోనే ఈ పాట దక్కించుకుంది అంటే ఏ స్థాయిలో ఈ పాట జనాలను ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్ లో కాకుండా ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ పై వంద మిలియన్ ల ప్లే స్ ఎప్పుడో పూర్తి చేసుకుని ఉంటుంది. బన్నీ గత చిత్రం అల వైకుంఠపురంలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యి బిలియన్ వ్యూస్ ను దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ పాట జోరు చూస్తుంటే కొన్ని వారాల్లోనే బిలియన్ వ్యూస్ ను దక్కించుకోవడం ఖాయంగా ఉంది. సినిమా విడుదల తర్వాత పాటకు మరింత సూపర్ రెస్పాన్స్ దక్కింది.
ఈ పాటను మంగ్లీ సోదరి అయిన ఇంద్రవతి చౌహాన్ పాడింది. కేవలం తెలుగు వర్షన్ మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ పాట ట్రెండ్ అవుతుంది. అక్కడ కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ ను దక్కించుకుంటుంది. ఈ పాట కన్నడ వర్షన్ ను మంగ్లీ పాడటం జరిగింది. మొత్తానికి ఈ పాట వల్ల సినిమా కు మంచి హైప్ రావడంతో పాటు సినిమా లో ఈ పాటతో అల్లు అర్జున్ మరింతగా ఎలివేట్ అయ్యాడు. సమంత వేసిన మాస్ స్టెప్పులు.. దేవి శ్రీ అందించిన మాస్ బీట్స్.. సుకుమార్ తీసిన మాస్ టేకింగ్ అంతా కలిపి ఈ పాటను అమాంతం ఆకాశంలో పెట్టాయి. ఏడాది చివర్లో వచ్చినా కూడా యూట్యూబ్ గ్లోబల్ రేటింగ్స్ లో ఏకంగా నెం.1 స్థానంలో నిలిచింది అంటే ఈ పాట ఏ స్థాయిలో జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ లో ఇప్పటి వరకు 102 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇక ఈ పాటకు కవర్ వీడియోలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కవర్ వీడియోల వ్యూస్ ఖచ్చితంగా పాతిక మిలియన్ల వరకు ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా ఈ పాట కేవలం యూట్యూబ్ లోనే 125 మిలియన్ ల వ్యూస్ ను అది కూడా 20 రోజుల్లోనే దక్కించుకుంది. పుష్ప సినిమా కూడా ఇదే స్థాయిలో భారీ వసూళ్లను దక్కించుకుంటుంది.