Begin typing your search above and press return to search.

100% ఆమె నడుంపై అలాగే..

By:  Tupaki Desk   |   1 Oct 2017 11:51 AM IST
100% ఆమె నడుంపై అలాగే..
X
సుకుమార్ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన 100% లవ్ సినిమా ఏ స్థాయిలో విజయం అందుకుందో తెలిసిన విషయమే. వరుస అపజయలతో ఉన్న దర్శకుడుకి హీరో నాగ చైతన్య కేరీర్ కి ఆ సినిమా 100% బూస్ట్ ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే కథను రీమేక్ చేసి హిట్ అందుకోవాలని అనుకుంటున్నారు కోలీవుడ్ కళాకారులు.

ఏర్.రెహమాన్ మేనల్లుడు యువ సంగీత దర్శకుడు జీవి.ప్రకాష్ కుమార్ హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు చంద్రమౌళి 100% లవ్ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు 100% కాదల్ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఇక తెలుగులో మహాలక్ష్మీ పాత్రతో అలరించిన తమన్నా చేసిన పాత్రను అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే నటిస్తోంది. సుకుమార్ సమర్పణలో భువన చంద్రమౌళి నిర్మిస్తున్నారు. అయితే రీసెంట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సినిమాలో హైలెట్ గా నిలిచిన సీన్ ని ఆ పోస్టర్ లో హైలెట్ చేశారు. తమన్నా నడుముపై రాసుకున్న గణిత లెక్కలను చైతు ఎలా కాపీ కొట్టాడో తెలిసిందే. ఇప్పుడు రీమేక్ పోస్టర్ లో కూడా జీవి.ప్రకాష్ కుమార్ కూడా షాలిని పాండే నడుముపై ఉన్న ఫార్ములాలను తన స్టైల్ లో కాపీ కొట్టేస్తున్నాడు.

చూస్తుంటే సినిమాలో తెలుగులో ఉన్న సీన్స్ నే తిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇక షాలిని పాండే లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అమ్మడికి ఇది రెండవ సినిమా. ఈ సినిమాకు సంగీతం కూడా హీరో జివి ప్రకాషే అందిస్తున్నాడు. అక్టోబర్ 11 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. 2018 సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.