Begin typing your search above and press return to search.

RRR ఓటీటీలో 1000 మిలియ‌న్ మార్కు...!

By:  Tupaki Desk   |   31 May 2022 3:13 AM GMT
RRR ఓటీటీలో 1000 మిలియ‌న్ మార్కు...!
X
2021-22 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ RRR థియేట్రిక‌ల్ గా రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 2022లో 1000 కోట్ల క్ల‌బ్ సినిమాగా రికార్డులు తిర‌గ‌రాసింది. అంత‌కుమించి ఇప్పుడు ఓటీటీలో విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఆ మేర‌కు టీమ్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. రామ్ చరణ్ -జూనియర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా SS రాజమౌళి తెర‌కెక్కించిన‌ బ్లాక్ బస్టర్ RRR ప్రస్తుతం OTT ప్లాట్ ఫారమ్ ZEE5లో తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

20 మే 2022న డిజిటల్ గా రంగప్రవేశం చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి భారీ స్పందనను అందుకుంటోంది. ఈ చిత్రం అన్ని భాషలు క‌లుపుకుని కేవ‌లం 10 రోజుల్లో 1000 మిలియన్ (1 బిలియన్) కంటే ఎక్కువ నిమిషాల వీక్ష‌ణ‌ల‌ను అందుకుంది. ZEE5లో ఇటీవల విడుదలైన ఏ చిత్రం తో పోల్చినా ఇది అసాధార‌ణ‌మైన ఆద‌ర‌ణ. ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్- అజయ్ దేవగన్- సముద్రఖని- ఒలివియా మోరిస్- శ్రియా శరణ్ త‌దిత‌రులు న‌టించారు. డివివి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ‌ భారీ స్థాయిలో నిర్మించింది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

RRR ఒక గొప్ప జ‌న‌రంజ‌క‌మైన వినోదాత్మ‌క సినిమా అని అన్ని వేదిక‌ల‌పైనా ప్రూవ్ అయింది. పెద్ద‌తెర‌ను డామినేట్ చేసేంత‌గా ఓటీటీ ఎదిగేస్తున్న క్ర‌మంలో ఇక్క‌డా సంచ‌ల‌నంగా మారింది. లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌కు ఫిక్ష‌న్ క‌థ‌ల‌కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ఉంటుంద‌న‌డానికి ఆర్.ఆర్.ఆర్ ఒక గొప్ప ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. ఈ లెస్స‌న్ బాలీవుడ్ తో పాటు అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌న జ‌క్క‌న్న నేర్పించార‌న్న చ‌ర్చ సాగుతోంది. మునుముందు రాజ‌మౌళి నుంచి ఇలాంటి పాన్ ఇండియా (వ‌ర‌ల్డ్) సినిమాలు వ‌స్తాయ‌నడంలో సందేహం లేదు. త‌దుప‌రి మ‌హేష్ ని అత‌డు పాన్ వ‌ర‌ల్డ్ హీరోగా ప‌రిచ‌యం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. మ‌హేష్ సినిమాకి థియేట్రిక‌ల్ బిజినెస్ తో పాటు ఓటీటీ రైట్స్ లో రికార్డ్ ధ‌ర ప‌ల‌క‌డం గ్యారెంటీ అన‌డంలో ఎలాంటి సందేహాలు లేవు.

పోటీలో ఎంద‌రు ఉన్నా RRR దే హ‌వా ఓవైపు RRR స్ట్రీమింగ్ అవుతున్నా పోటీలో ప‌లు క్రేజీ హీరోలు న‌టించిన సినిమాలు అందుబాటులో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ క‌థానాయ‌కులుగా న‌టించిన 'ఆచార్య' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.

థియేటర్ల‌లో వీక్షించ‌ని వారికోసం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఇద్ద‌రు అగ్ర హీరోలు ప్రధాన పాత్రలలో నటించిన ఈ యాక్షన్ డ్రామాకు కొరటాల శివ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. పెద్ద తెర‌పై ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్.ఆర్‌.ఆర్ తో పాటే ఆచార్య కూడా అదే రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయింది. విడుదలైన మూడు వారాల్లోనే ఆచార్య‌ డిజిటల్ స్పేస్ లో విడుద‌లైంది.

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్ న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ట్వ‌ల్త్ మ్యాన్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో నేరుగా విడుద‌లైంది. దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మే 6న విడుదలైన శ్రీవిష్ణు తాజా విహారం భళా తందానానా.. మే 20న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ప్ర‌ద‌ర్శితమైంది. ప‌లు ఆంగ్ల సిరీస్ లు ఆర్.ఆర్.ఆర్ కి పోటీగా ఉన్నాయి. చిప్ ఎన్ డేల్: రెస్క్యూ రేంజర్స్ .. ఇంగ్లీష్ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్ లో మే 20 నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. పంచాయత్ హిందీ వెబ్ సిరీస్ మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్ష‌కుల కోసం స్ట్రీమింగ్ అయింది. లవ్ డెత్ + రోబోట్స్ సీజన్ 3 మే 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వ‌చ్చింది. నైట్ స్కై సీజన్ 1 ఇంగ్లీష్ వెబ్ సిరీస్.. మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇన్నిటితో పోటీప‌డుతూ ఆర్.ఆర్.ఆర్ అసాధార‌ణ వీక్ష‌ణ‌ల‌ను అందుకుంది.