Begin typing your search above and press return to search.
'సైరా' కోసం రంగంలోకి వెయ్యి మంది
By: Tupaki Desk | 18 Jan 2019 12:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ను లీడ్ గా తీసుకుని - కొన్ని కల్పిత సీన్స్ ను జోడించి సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని బడ్జెట్ కు వెనకాడకుండా నిర్మిస్తున్నాడు. తెలుగు సినీ చరిత్రలో టాప్ బడ్జెట్ చిత్రాల జాబితాలో ఇది చేరబోతుంది. దాంతో పాటు అన్ని విషయాల్లో కూడా చాలా రిచ్ గా - రికార్డులు నమోదు అయ్యేలా సైరా చిత్రాన్ని చరణ్ నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో కీలక సన్నివేశం తర్వాత రాబోయే పాటను తెలుగు సినీ చరిత్రలో ఎప్పుడు లేనంత గ్రాండ్ గా చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద సెట్టింగ్ ను వేస్తున్నారు. దాదాపు వెయ్యి మంది డాన్సర్స్ తో పాటు - మరో వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులను ఈ పాట కోసం వినియోగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారట.
ఇప్పటి వరకు రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రంలో చిత్రీకరించబడ్డ పాటలో అత్యధిక డాన్సర్స్ పాల్గొన్నారు. 500 మంది డాన్సర్స్ తో బోయపాటి ఆ పాటను చిత్రీకరించాడు. ఇప్పుడు ఆ పాటకు డబుల్ అంటే వెయ్యి మంది డాన్సర్స్ తో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమీర్ ఖాన్ లగాన్ సినిమాలోని చలే చలో.. సాంగ్ తరహాలోనే ఈ పాట ఉంటుందని - స్వాతంత్య్ర ఉద్యమ కాంక్షను పెంచే విధంగా ఈ పాట సాహిత్యం ఉంటుందనిపిస్తుంది. ఈ పాటలో చిరంజీవి - తమన్నా - నయనతార ఇంకా పలువురు స్టార్స్ మరియు డాన్సర్స్ ఈ పాటలో కనిపించబోతున్నారట.