Begin typing your search above and press return to search.

మహేష్ ఖాతాలో చేరిన 1020 చిట్టి గుండె

By:  Tupaki Desk   |   16 Jan 2021 1:00 PM
మహేష్ ఖాతాలో చేరిన 1020 చిట్టి గుండె
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు చిన్న పిల్లల గుండె సమస్యలకు సంబంధించి ఆపరేషన్‌ లు చేయిస్తున్నాడు. ఒకటి కాదు పది కాదు వంద కాదు ఏకంగా వెయ్యికి పైగా మహేష్‌ బాబు సాయం వల్ల కొట్టుకుంటున్నాయి. మహేష్ వల్ల కొట్టుకుంటున్న చిన్నారుల గుండెల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే 1019 వ ఆపరేషన్‌ ను చేయించినట్లుగా నమ్రత సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పుడు ఆ సంఖ్య కాస్త ఏకంగా 1020 కి చేరింది. చిన్న పిల్లలకు ఎంతో మందికి ఇప్పటికే ప్రాణాలు పోసిన మహేష్‌ దంపతులు మరో గుండెకు ప్రాణం పోశారు.

నమత్ర సోషల్‌ మీడియా ద్వారా ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు. మరో గుండె కు ఆపరేషన్‌ జరిగింది. ఆంధ్రా ఆసుపత్రి వారి సహకారంతో మరో గుండెకు ప్రాణం పోసినట్లుగా ఆమె పేర్కొన్నారు. పిల్లల మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన కొనసాగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఒక్క హీరో ఇంత మంది చిన్నారులకు గుండె ఆపరేషన్‌ చేయించారు అంటే నిజంగా ఒక రికార్డు అని, ఈ సంఖ్య పది వేలకు చేరాలని ఆకాంక్షిస్తున్నట్లుగా మహేష్‌ బాబు అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్‌ బాబు దంపతుల దాతృత్వంకు వారికి అంతా మంచే జరగాలని నెటిజన్స్‌ ఆకాంక్షిస్తున్నారు.