Begin typing your search above and press return to search.

ప‌దేళ్ల త‌ర్వాతా టూమ‌చ్ సెక్సీ

By:  Tupaki Desk   |   18 Jan 2019 1:30 AM GMT
ప‌దేళ్ల త‌ర్వాతా టూమ‌చ్ సెక్సీ
X
ప‌దేళ్లు వెన‌క్కి వెళితే... ప‌దేళ్లు ముందుకు రీలును తోడితే.. అప్పుడెలా ఉన్నాం.. ఇప్పుడెలా ఉన్నాం? అప్ప‌టికి ఇప్పటికి రూపంలో మార్పు ఎంత‌? ఈ ఊహే ఇంట్రెస్టింగ్ క‌దూ?... `24` వాచ్ లాంటిది దొరికితే ఓ ట్ర‌య‌ల్ వేసేందుకు వెన‌కాడ‌రెవ‌రూ.. టైమ్ ట్రావెలింగ్ మెషీన్ దొరికితే క‌చ్ఛితంగా అటూ ఇటూ ప్ర‌యాణించి చెక్ చేసుకునే వీలుండేది. కానీ అది ఎప్ప‌టికీ జ‌ర‌గ‌ని ప‌ని.

కానీ రియాలిటీలో ఓమారు కాస్త ఫ‌న్ కోసం ప‌దేళ్ల క్రితం నేను ఎలా ఉన్నాను? అని వెతుక్కుంటూ వెళితే ఫోటో ఆల్బ‌మ్స్ లోంచి కొన్ని ఫోటోల్ని షేర్ చేసుకోవాల‌ని ఎవ‌రికైనా అనిపించ‌కుండా ఉంటుందా? ఇదిగో అలాంటి ఓ కొత్త ట్రెండ్ వ‌చ్చిందిప్పుడు. 10 ఇయ‌ర్స్ ఛాలెంజ్ పేరుతో అది ఇప్ప‌టికే జోరుగా వైర‌ల్ అయిపోతోంది. బ‌కెట్ ఛాలెంజ్.. సెల్ఫీ ఛాలెంజ్.. గ్రీన్ ఫీ ఛాలెంజ్‌ - కికి ఛాలెంజ్‌.. కుల్ఫీ ఛాలెంజ్.. అంటూ చాలానే ఛాలెంజ్ లు వ‌చ్చాయి. ఇప్పుడు 10 ఇయ‌ర్స్ ఛాలెంజ్ కూడా అంతే ఇదిగా పాపుల‌రైపోతోంది.

ఈ ఛాలెంజ్ లో ఇప్ప‌టికే హాటీ నాటీ బ్యూటీస్ ప‌దేళ్ల నాటి ఫోటోల్ని - ఇప్ప‌టి ఫోటోల‌తో క‌లిసి సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. ఇందులో న‌ల్ల‌క‌లువ బిపాసా బ‌సు - డ‌స్కీ బ్యూటీ డెయిసీ షా - సాగ‌ర‌క‌న్య శిల్పాశెట్టి - శ్రుతిహాస‌న్ - దియా మిర్జా ఉన్నారు. ఉద‌య్ కిర‌ణ్ హీరోయిన్ అనిత కూడా పాత ఫోటో - కొత్త ఫోటో క‌లిపి షేర్ చేసింది. జ‌హీర్ ఖాన్ భార్య సాగ‌రిక కూడా హాట్ షాట్ ఫోటోల్ని షేర్ చేసి వేడి పెంచింది. హాలీవుడ్ నాయిక‌లు జెన్నిఫ‌ర్ లోపెజ్ - ఫిష‌ర్ త‌దిత‌రులు ఇప్ప‌టికే కొన్ని ఫోటోల్ని షేర్ చేయ‌డంతో ఇవ‌న్నీ జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి.