Begin typing your search above and press return to search.
ముసలి నోట్లో 11 సినిమాలు!
By: Tupaki Desk | 2 July 2015 5:31 AM GMTముందుంది ముసళ్ల పండగ అనుకున్నారో ఏమో.. ఇప్పటివరకూ ల్యాబుల్లో దాచి పెట్టిన చిన్నా చితకా సినిమాలన్నిటినీ దుమ్ము దులిపి ఒకేసారి వదిలేస్తున్నారు. ఈ శుక్రవారం థియేటర్లను ఓ డజను సినిమాలు ముంచెత్తనున్నాయి. ఇప్పటివరకూ ఈ సినిమాల టైటిల్స్ కూడా జనాలకు తెలియవు. ఏదోలా ఆపసోపాలు పడుతూ చివరకు అన్ని పనులు పూర్తి చేసుకుని వెయిటింగ్‌లో ఉన్న ఓ 8 స్ట్రెయిట్ సినిమాలు, ఓ మూడు అనువాద చిత్రాలు రిలీజ్‌లకు వస్తున్నాయి. అయితే వీటన్నిటినీ భారీ చిత్రం 'బాహుబలి' ముందు రిలీజ్ చేయడం ఆత్మహత్యా సదృశం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఏకంగా బాహుబలి అనే ముసలి నోట్లోకి వెళుతున్నాయని అంటున్నారు. ఓమారు వివరాల్లోకి వెళితే..
ఈ నెల 10న ప్రభాస్, రానా ప్రధాన పాత్రలుగా నటించిన బాహుబలి రిలీజవుతోంది. అంత పెద్ద భారీ సినిమా వచ్చేస్తే ఏకంగా నాలుగు వారాల పాటు ఏ సినిమా రిలీజైనా ఖతమ్ అన్న భయం పట్టుకుంది మన నిర్మాతలకు. అంతేనా బాహుబలి తర్వాత కిక్2, శ్రీమంతుడు వంటి భారీ సినిమాలు క్యూలో ఉన్నాయి. అందుకే ఇక ఎప్పటికీ రిలీజ్ కావు అనుకున్న తమ సినిమాల్ని వరుస పెట్టి రిలీజ్ చేసేస్తున్నారు. శుక్రవారం థియేటర్లలో చిన్న సినిమాలతో జాతరకు రంగం సిద్ధం చేశారు. ఒకేసారి 11 సినిమాలొస్తున్నాయి. మనోజ్ నందం నటించిన రెండు సినిమాలు యూత్‌ఫుల్ లవ్, ఓ సఖియా నా ప్రియ సఖియా బాక్సాఫీస్ బరిలోకి వస్తున్నాయి. మాయా చిత్రం, ది బెల్స్, 200క్రోర్ బ్లాక్ మనీ, గ్యాంగ్స్ ఆఫ్ గబ్బర్‌సింగ్ (నైజాం ఓన్లీ) వంటి చిన్న చిత్రాలు తామరతంపరగా రిలీజైపోతున్నాయి. వీటితో పాటు మూడు అనువాద చిత్రాలు రేసులో ఉన్నాయి. మహా వంశం, శీనుగాడి లవ్‌స్టోరి, టెర్మినేటర్ జెనిసిస్ (ఆర్నాల్డ్) (తెలుగు అనువాదం) రిలీజవుతున్నాయి. మిగతా సినిమాల మాటేమో గానీ ఆర్నాల్డ్ టెర్మినేటర్ బాహుబలికి పోటీ ఇస్తుందనుకుంటే ఇప్పటికే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి ఈ 11 సినిమాలు ముసలి నోట్లోకి వెళ్లినట్టేనని అంటున్నారు.
స్టార్ పవర్ ఉన్న సినిమాలే తొలివారం వసూళ్లతో బైటపడతాయి. అసలు ఏ స్టార్ పవర్, క్రేజు లేకుండా వస్తున్న ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఊపేస్తాయని అనుకోలేం. చిన్న నిర్మాతలకు పెట్టిన పెట్టుబడులైనా తిరిగి రావాలంటే చాలా కష్టమని విశ్లేషిస్తున్నారు. ఒక వారం ఆడినా ఆ సినిమా ఏ థియేటర్‌లో ఉందో కనుక్కోవడానికి జనాలకు ఆ వారం సరిపోవడం లేదు. సరైన ప్రచారం లేని ఈ సినిమాలన్నీ ఎలా గట్టుక్కుతాయని ప్రశ్నిస్తున్నారంతా. ఇప్పుడు రిలీజైనా, ఇంకెప్పుడు రిలీజైనా ఇదే దుస్థితి ఈ చిత్రాలకు.