Begin typing your search above and press return to search.

11 ఏళ్ల ప్రేమ బంధం.. ఇప్పుడు పెళ్లి బంధం

By:  Tupaki Desk   |   16 Nov 2021 5:29 AM GMT
11 ఏళ్ల ప్రేమ బంధం.. ఇప్పుడు పెళ్లి బంధం
X
బాలీవుడ్ స్టార్ నటుడు రాజ్ కుమార్‌ రావు పెళ్ల చేసుకున్నాడు. ఇతడు గత 11 ఏళ్లుగా పత్రలేఖ తో ప్రేమలో ఉన్నాడు. మొదట వీరి ప్రేమ విషయం బయటకు పొక్కలేదు. కాని ఆ తర్వాత తర్వాత మీడియాలో వీరి ప్రేమ గురించి వార్తలు వచ్చాయి. ఇద్దరి విషయం బాలీవుడ్ లో అందరికి తెల్సిందే. ఇన్నాళ్ల వీరి ప్రేమ బంధంను వివాహ బంధంతో మరింతగా పదిలం చేసుకున్నారు. అత్యంత వైభవంగా రాజ్ కుమార్ రావు చండీగఢ్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో పత్రలేఖ మెడలో తాళి కట్టి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. వీరిద్దరి వివాహంకు కొద్ది మంది బాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరు అయ్యారని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో అతిథులు స్వల్ప సంఖ్యలోనే ఈ పెళ్లికి హాజరు అయ్యారనేది సమాచారం.

పెళ్లి తర్వాత రాజ్‌ కుమార్‌ రావు సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశాడు. పెళ్లి ఫొటోను షేర్‌ చేసి 11 ఏళ్ల తమ ప్రేమను పెళ్లి బంధంగా మల్చుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. 11 సంవత్సరాల ప్రేమ.. స్నేహం.. వినోదం తర్వాత ఈ రోజు నువ్వు నా సర్వస్వం అయ్యావు. నా సోల్‌ మేట్‌.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ను పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ రాజ్ కుమార్ రావు ఇన్ స్టా లో పోస్ట్‌ పెట్టాడు. సోషల్‌ మీడియాలో రాజ్ కుమార్‌ రావు షేర్ చేసిన ఫొటోలు మరియు ఆయన పోస్ట్‌ సినీ జనాలతో పాటు నెటిజన్స్ ను కూడా ఆకట్టుకుంది.

రాజ్ కుమార్‌ రావు మరియు పత్ర లేఖ లు సుదీర్ఘ కాలం ప్రేమించుకున్నారు. వీరి గురించి మీడియాలో రకరకాలుగా పుకార్లు షికారు చేయడం జరిగింది. బాలీవుడ్ వర్గాల వారు కూడా వీరిద్దరు పెళ్లి చేసుకోవడం అనుమానమే అన్నట్లుగా కామెంట్స్ చేశారు. అలాంటిది ఇప్పుడు వీరిద్దరు పెళ్లి చేసుకుని కొత్త జీవితంను ఆరంభించారు. కొత్త జీవతంను ఆరంభించిన వీరికి బాలీవుడ్ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు మరియు బంధు మిత్రులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.