Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ : క్రైమ్ క్యూరియాసిటీ
By: Tupaki Desk | 15 Feb 2019 12:26 PM GMTనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకత్వం వహించిన 118 ట్రైలర్ విడుదలైంది. ఎప్పుడూ మాస్ సినిమాలతో పలకరించే కళ్యాణ్ రామ్ ఈ సారి జానర్ మార్చి కొత్తగా ట్రై చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ లో విశేషాలేంటో చూద్దాం. కళ్యాణ్ రామ్ అంతు చిక్కని ఓ రహస్యం కోసం వెతుకుతూ ఉంటాడు. ప్రియురాలు షాలిని పాండే పక్కనే ఉన్నా కనిపించకుండా పోయిన నివేదా థామస్ కోసమే అతని అన్వేషణ సాగుతూ ఉంటుంది.
తాను చూసింది కల లేక నిజామా అనేది కూడా అర్థం కానీ స్థితిలో స్నేహితుడు ప్రభాస్ శీనుతో కలిసి వేట మొదలుపెడతాడు. మధ్యలో సైక్రియాట్రిస్టు నాజర్ సహాయం కూడా అవసరం పడుతుంది. అయితే ఈ క్రమంతో తనకు కనిపించకుండా వెంటాడుతున్న శత్రువుతో కళ్యాణ్ యుద్ధం చేయాల్సి వస్తుంది. అసలు నివేదా ఎవరు తాను హత్య చేయబడిందా తనకు కళ్యాణ్ రామ్ కు సంబంధం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం 118. టైటిల్ లో సూచించిన నెంబర్ ఒంటి గంట పదహేను నిముషాలు అనే అర్థం ఓ షాట్ లో డిజిటల్ క్లాక్ లో చూపించారు.
ట్రైలర్ లో మంచి ఇంటెన్సిటీ ఉంది. అనవసరమైన అంశాలకు చోటు ఇవ్వకుండా కెవి గుహన్ చెప్పాలనుకున్న పాయింట్ కు కట్టుబడినట్టుగా కనిపిస్తోంది. స్వతహాగా సీనియర్ కెమెరా మెన్ కావడంతో చాలా హై స్టాండర్డ్ ఉంది. శేఖర్ చంద్ర సంగీతం కూడా బ్యాక్ గ్రౌండ్ రూపంలో బాగా ఎలివేట్ చేసింది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. మార్చ్ 1న విడుదల కానున్న 118 ద్వారా నందమూరి ఫ్యాన్స్ కి కళ్యాణ్ రామ్ ఏదో కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉన్నాడు. ఆసక్తి రేపెలా ఉన్న 118 చిక్కుముడి వీడాలి అంటే ఇంకో రెండు వారాలు వెయిట్ చేయక తప్పదు.