Begin typing your search above and press return to search.
#2021 NYE ఆర్జీవీ ఇస్తున్న షాకింగ్ గిఫ్ట్ ఇదే
By: Tupaki Desk | 24 Dec 2020 1:40 PM GMT2020 ముగించేందుకు ఇంకో ఐదురోజులే మిగిలి ఉంది. డిసెంబర్ 31 మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కి యూత్ రెడీ అవుతోంది. 2021లో అడుగు పెట్టే వేళ సంబరాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకనుంది యువతరం. ఇక కొత్త ఏడాదిలో అయినా కరోనా భయాలు వదిలి జనం థియేటర్లకు కదిలి వస్తారా? అన్నది సందిగ్ధంగా మారగా.. సంక్రాంతి బరిలో వరుసగా మూడు సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. క్రాక్- రెడ్- మాస్టర్ చిత్రాలు రిలీజ్ బరిలో ఉన్నాయి.
అయితే 2021లో అంతకుముందే ట్రీటిచ్చేందుకు తన సినిమాని సిద్ధం చేస్తూ ఆర్జీవీ హాట్ టాపిక్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ `12 ఓ క్లాక్` 2021 మొదటి థియేట్రికల్ విడుదల అన్న ప్రకటన సడెన్ ట్విస్ట్.
హర్రర్ జానర్ తో ఆర్జీవీ థియేటర్లలో జనాల్ని లాక్ చేసేస్తాడట. రాత్- భూత్ .. వాస్తు శాస్త్రం లాంటి చిల్లింగ్ హర్రర్ చిత్రాలను అందించిన ఆర్జీవీ ఈసారి 12 ఓ క్లాక్ తో అదిరే హారర్ ట్రీటిస్తాడట. 12 ఓ క్లాక్ టైటిల్ ని ప్రకటించడమే గాక.. పోస్టర్ లో చెప్పినట్లుగా ఈ చిత్రం సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ అని తెలిపారు.
హర్రర్ థ్రిల్లర్లకు అన్నివేళలా ఆదరణ ఉంటుంది. సరైన అనుభవం కోసం సినిమాను సినిమా హాల్ లోనే చూడాలి అనేది ఆర్జీవీ భావన. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ``హర్రర్ మానసికంగా ఎక్కువగా ప్రభావితం చేస్తుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఎందుకంటే మనం స్వంత ఇమాజినేషన్ ను ఉత్తేజపరిచేటప్పుడు మరింత భయపడతాం. హర్రర్ కళా ప్రక్రియ ఎల్లప్పుడూ నన్ను ఎగ్జయిట్ చేస్తుంది. ప్రేక్షకులను భయపెట్టడానికి నేను ఈ చిత్రంలో చాలా కొత్త టెక్నిక్ ను ప్రయత్నించాను. బాహుబలి ఫేమ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మొదటిసారి హర్రర్ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసారు`` అని వెల్లడించారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా.. కంపెనీ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి- మకరంద్ దేశ్ పాండే- దివ్య జగదాలే- మానవ్ కౌల్ - అలీ అజ్గర్- ఆశిష్ విద్యార్థి- దిలీప్ తహిల్ - ఫ్లోరా షైనీ - కృష్ణ గౌతమ్ నటించారు. ఈ చిత్రం 2021 జనవరి 8న యుఎఫ్ ఓ సినీ మీడియా నెట్‌వర్క్ ద్వారా విడుదలవుతోంది.