Begin typing your search above and press return to search.

120 కోట్లు న‌ష్టం తెచ్చిన '83' బ‌యోపిక్

By:  Tupaki Desk   |   12 Jan 2022 4:30 AM GMT
120 కోట్లు న‌ష్టం తెచ్చిన 83 బ‌యోపిక్
X
ర‌ణ్ వీర్ సింగ్ న‌టించిన బ‌యోపిక్ చిత్రం `83` డిసెంబ‌ర్ 24న రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. 1983లో ఇండియా తొలిసారి వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన క్రీడానేప‌థ్యంతో టీమిండియా కెప్టెన్ క‌పిల్ దేవ్ కోణంలో ఈ చిత్రాన్ని క‌బీర్ ఖాన్ తెర‌కెక్కించారు. మొత్తం ఆరు నిర్మాణ సంస్థ‌లు భాగ‌స్వామ్యంలో నిర్మించాయి. రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్ట‌గా..ఫాంట‌మ్ ఫిల్మ్స్ ..న‌డియావాలా గ్రాండ్ స‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్స్..వైబ్రీ మీడియా.కె.ఏ ప్రొడ‌క్ష‌న్స్ భాగం పంచుకున్నాయి. దీపిక‌-ర‌ణ‌బీర్ నిర్మాత‌లుగా పెట్టుబ‌డులు పెట్టారు. క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాల మధ్య డిసెంబ‌ర్ 24న రిలీజ్ అయింది. కానీ మొద‌టి షోతోనే `83` అంతంత మాత్రం వ‌సూళ్ల‌తో నిరాశ‌ప‌రిచింది. స‌మీక్ష‌లు పాజిటివ్ గా ఉన్నా థియేట‌ర్ల‌కు జ‌నం రాలేదు.

క‌నీసం క్రికెట్ ప్రేమికుల్ని కూడా చిత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. సినిమాకి ఓపెనింగ్స్ కూడా స‌రిగ్గా రాలేదు. ముఖ్యంగా యూత్ ఈ చిత్రాన్ని పట్టించుకున్న‌దే లేదు. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రాల‌గా నిలిచిన `వెల్వెట్`..`ద్రోణ` చిత్రాల స‌ర‌స‌న `83` చేరింది. అంటే సినిమా ఏ స్థాయిలో జ‌నాల్ని ఆక‌ట్టుకుందో అర్ధం చేసుకోవ‌చ్చు. తాజాగా ఈ సినిమాతో నిర్మాత‌ల‌కు భారీగానే ణ‌స్టాలు వ‌చ్చిన‌ట్లు తేలింది. దాదాపు 120 కోట్ల‌కు పైగానే న‌ష్టాలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. క్రిడా నేప‌థ్యం..అదీ క్రికెట్ బ్యాక్ డ్రాప్ సినిమా ఈ స్థాయిలో డిజాస్ట‌ర్ అవ్వ‌డం బాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఇదే తొలిసారి.

క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చాలా సినిమాలు స‌క్సెస్ అయ్యాయి. కానీ `83` మాత్రం ఊహించ‌ని ప‌రాభ‌వాన్ని మిగిల్చింది. దీంతో సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌కుల దాడి పీక్స్ లో జ‌రుగుతోంది. అయితే ఈ ప‌రాజ‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు క‌బీర్ ఖాన్ క‌రోనా వైర‌స్ మీద‌కు తోసేసారు. పాండ‌మిక్ కార‌ణంగా త‌మ సినిమా స‌రిగ్గా ఆడ‌లేదని.. కంటెంట్ లోపం కాద‌ని స‌మ‌ర్థించుకున్నారు. అదే స‌మ‌యంలో రిలీజ్ అయిన `పుష్ప‌`..`స్పైడ‌ర్ మ్యాన్`..`సూర్య‌వంశీ లాంటి చిత్రాలు పెద్ద స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. బ‌యోపిక్ కేట‌గిరీలోనే తెర‌కెక్కి డిజాస్ట‌ర్ గా నిలిచిన ఎన్టీఆర్ -క‌థానాయ‌కుడు .. ఎన్టీఆర్- మ‌హానాయకుడు త‌ర్వాత తెలుగు స‌ర్కిల్స్ లోనూ మ‌ళ్లీ అంత ఇదిగా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.