Begin typing your search above and press return to search.

శాటిలైల్ 120 కోట్లు.. డిజిటల్ 60 కోట్లు

By:  Tupaki Desk   |   25 Nov 2018 4:30 PM GMT
శాటిలైల్ 120 కోట్లు.. డిజిటల్ 60 కోట్లు
X
ఈ ఏడాది ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ అంటే.. ‘2.0’నే. బడ్జెట్ లెక్కల్లో చూస్తే.. ఈ ఏడాదేంటి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ ఫిలిం. ఏకంగా రూ.545 కోట్ల భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు శంకర్. ఒక భారతీయ చిత్రానికి మరీ ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ముందు రూ.300 కోట్ల దగ్గర మొదలై.. చివరికి రూ.545 కోట్ల దగ్గర తేలింది ‘2.0’ బడ్జెట్ లెక్క. మరి ఇంత మొత్తం వెనక్కి తేవడం సాధ్యమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి.

కానీ చిత్ర బృందం మాత్రం చాలా ధీమాగా ఉంది. హీరో రజనీకాంత్ అయితే పెట్టిన బడ్జెట్ మీద రెట్టింపు వసూలవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. రిలీజ్ తర్వాత వసూళ్ల సంగతేమో కానీ.. విడుదలకు ముందే ఈ చిత్రానికి దాదాపుగా పెట్టుబడి వెనక్కి వచ్చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కేవలం శాటిలైట్.. డిజిటల్ హక్కుల రూపంలోనే ‘2.0’ నిర్మాతలకు రూ.180 కోట్ల ఆదాయం దక్కినట్లు కోలీవుడ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది.

అన్ని భాషలకూ కలిపి ‘2.0’ శాటిలైట్ హక్కుల్ని రూ.120 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఇది ఇండియన్ సినిమాల్లో రికార్డని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు డిజిటల్ హక్కుల రూపంలో ‘2.0’ ఇంకో రూ.60 కోట్లు తెచ్చిపెట్టిందట. ఇది కూడా రికార్డే. మొత్తంగా బిజినెస్ విషయంలోనూ ఇండియన్ సినిమాల రికార్డుల్ని ‘2.0’ తుడిచిపెట్టేసిందని అంటున్నారు. మరి వసూళ్ల విషయంలోనూ ఈ చిత్రం కొత్త రికార్డులు నెలకొల్పుతుందా అన్నది చూడాలి. ఈ గురువారమే ‘2.0’ థియేటర్లలోకి దిగుతోంది.