Begin typing your search above and press return to search.

మహేష్, బాలయ్యల రుణాన్ని ఉంచుకోలేదు

By:  Tupaki Desk   |   13 Feb 2016 6:17 AM GMT
మహేష్, బాలయ్యల రుణాన్ని ఉంచుకోలేదు
X
14 రీల్స్.. రెండేళ్ల కిందటి వరకు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ ల్లో ఒకటిగా ఉందీ సంస్థ. కానీ 1 నేనొక్కడినే - ఆగడు లాంటి డిజాస్టర్ల తర్వాత ఆ సంస్థ ఇమేజ్ బాగా దెబ్బ తిని.. ఏడాదికి పైగా సినిమానే మొదలుపెట్టలేని పరిస్థితికి వచ్చింది. అంతే కాదు.. 50-60 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసేవాళ్లు ఒక్కసారిగా రూ.10 కోట్ల రేంజికి పడిపోయారు. ఐతే బడ్జెట్ తక్కువైనా సరే.. మంచి సినిమా అయితే తీశారు. ఈ బేనర్లో వచ్చిన కొత్త సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ విడుదలకు ముందు మంచి హైప్ తెచ్చుకోవడమే కాదు.. విడుదల తర్వాత అద్భుతమైన టాక్ కూడా సంపాదించుకుంది. 14 రీల్స్ వాళ్ల ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు ఇద్దరు బడా స్టార్ల పట్ల కృతజ్నత చాటుకున్న తీరు కూడా ప్రశంసలందుకుంటోంది.

14 రీల్స్ సంస్థతో మహేష్ బాబుకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ ను తనకు అందించిన ఈ సంస్థ మీద మహేష్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇది తన సొంత సంస్థలాంటిదని చాలాసార్లు చెప్పాడు మహేష్. ఈ సంస్థలో 1 - ఆగడు లాంటి డిజాస్టర్లు చేసినా ఆ అభిమానం ఏమీ తగ్గలేదు. కృష్ణగాడి వీర ప్రేమ గాథ ఆడియో ఫంక్షన్ కు వచ్చి వాళ్ల మీద అభిమానాన్ని చాటుకున్నాడు. మరోవైపు ఈ సంస్థలో ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలయ్య. మరోవైపు సినిమాలో బాలయ్య పేరును భలేగా వాడేసుకున్నారు 14 రీల్స్ వాళ్లు. ఈ రకంగా తమ సంస్థకు సాయపడ్డ మహేష్ - బాలయ్యలకు సినిమా ఆరంభంలోనే ప్రత్యేకంగా కృతజ్నతలు చెప్పి ఆ హీరోల అభిమానుల మనసులు గెలిచారు 14 అనిల్, రామ్, గోపీనాథ్.