Begin typing your search above and press return to search.
లైంగిక వేధింపుల్లో నిర్మాతకు 140 ఏళ్ల జైలు?
By: Tupaki Desk | 10 Oct 2022 4:30 PM GMTవేధింపుల మాన్ స్టర్ వైన్ స్టెయిన్ ని కోర్టు కేసులు విడువడం లేదు. మీటూ ఉద్యమంలో బుక్కయిన తొలి అతి పెద్ద మాన్ స్టర్ గా హాలీవుడ్ నటుడు కం నిర్మాత హార్వే వైన్ స్టెయిన్ పేరు మార్మోగింది. అతడు ఆడ మగ అనే తేడా లేకుండా పలువురు నటీనటులను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు వెల్లువెత్తడం అప్పట్లో సంచలనమైన సంగతి తెలిసిందే.
నటుడు కం నిర్మాత హార్వే వైన్ స్టెయిన్ రెండవ లైంగిక వేధింపుల విచారణ సోమవారం లాస్ ఏంజిల్స్ లో ప్రారంభమవుతుంది. 2020లో న్యూయార్క్ లో హార్వే వైన్ స్టెయిన్ అత్యాచారం సహా నేరపూరిత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లాస్ ఏంజిల్స్ లో సోమవారం నాడు అతను ఆరోపణలకు సంబంధించి కొత్త విచారణను ఎదుర్కొంటాడు. మాజీ హాలీవుడ్ నిర్మాత వైన్ స్టెయిన్ ప్రస్తుతం ఐదుగురు మహిళలను వేధించిన నేరారోపణలపై 11 కౌంట్లను ఎదుర్కొంటున్నారు.
క్రూరుడైన నిర్మాత హార్వే వైన్ స్టెయిన్ పై వెరైటీ నివేదిక ప్రకారం.. విచారణ రెండు నెలల వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. జ్యూరీ ఎంపిక సోమవారం ప్రారంభమవుతుంది. రెండు పక్షాలు సర్వత్రా ప్రీ-ట్రయల్ పబ్లిసిటీ ద్వారా పక్షపాతానికి తావులేని జ్యూరీలను పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నందున కనీసం రెండు వారాలు పట్టవచ్చని భావిస్తున్నారు.
ప్రముఖ హాలీవుడ్ నటీమణులు సహా 100 మందికి పైగా మహిళలు వైన్ స్టీన్ లైంగిక దుష్ప్రవర్తనపై దశాబ్దాల తరబడి ఆరోపణలు చేశారు. అతడి లైంగిక వేధింపుల ప్రహసనాన్ని బహిర్గతం చేస్తూ వేధింపులకు వ్యతిరేకంగా #MeToo ఉద్యమానికి ఆజ్యం పోశారు.
కాలిఫోర్నియాలోని ఒక ప్రత్యేక క్రిమినల్ కేసులో నాలుగు అత్యాచార నేరాలు... అలాగే ఏడు ఇతర లైంగిక వేధింపుల గణనలకు సదరు నిర్మాత కం నటుడు లాస్ ఏంజిల్స్ కోర్టులో నిర్దోషిని అని ఇప్పటికే వాదించాడు. అతను ప్రస్తుతం న్యూయార్క్ లో మునుపటి నేరారోపణల కోసం 23 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. తాజా నివేదిక ప్రకారం లాస్ ఏంజిల్స్ విచారణ అనేక విధాలుగా మొదటి విచారణను పోలి ఉంటుంది. లాస్ ఏంజిల్స్ బాధితుల్లో ఒకరైన జేన్ డో #2 న్యూయార్క్ లో సహాయక సాక్షిగా కూడా సాక్ష్యమిచ్చింది.
వైన్‌స్టీన్ తన అధికారాన్ని తప్పుగా ఉపయోగించి.. కెరీర్ లో పురోగతికి సంబంధించిన వాగ్దానాన్ని ఉపయోగించి మహిళలను హోటల్ గదులకు రప్పించాడని అక్కడ అతను వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రాసిక్యూషన్ వాదించే అవకాశం ఉంది. మహిళలు అబద్ధాలు చెబుతున్నారని వారిలో కొందరు వైన్ స్టీన్ తో ఏకాభిప్రాయ సంబంధాలను కొనసాగించారని డిఫెన్స్ లాయర్లు వాదించాలని భావిస్తున్నారు. లాస్ ఏంజిల్స్ లో దోషిగా తేలితే వైన్ స్టీన్ 140 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటాడు.
ప్రముఖ నటీమణులు సహా 100 మందికి పైగా మహిళలు వైన్ స్టీన్ లైంగిక దుష్ప్రవర్తనకు దశాబ్దాల తరబడి ఆరోపణలు చేశారు. వీటన్నిటిపైనా విచారణ సాగుతోంది. ఏళ్ల తరబడి ఇది కొనసాగనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.