Begin typing your search above and press return to search.
కుంద్రా స్కాండల్: వీడియోలతో 2024 నాటికి 146 కోట్ల బిజినెస్ ప్లాన్
By: Tupaki Desk | 29 July 2021 11:30 PM GMTరాజ్ కుంద్రా స్కాండల్ ప్రస్తుతం బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేస్తున్న సంగతి తెలిసిందే. వయోజన (న్యూడ్) చలనచిత్రాల ప్రదర్శన యాప్ లతో భారీగా ఆదాయ ఆర్జనను కుంద్రా ప్లాన్ చేయడం సంచలనంగా మారింది. ఏడాదికి రూ .34 కోట్లు చొప్పన 2023-24 నాటికి 146 కోట్ల ఆర్జన లక్ష్యంగా కుంద్రా ప్లాన్ డిజైన్ చేశారని ముంబై క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది.
రాజ్ కుంద్రా వయోజన చలనచిత్ర రాకెట్లో మరింత దర్యాప్తు నేపథ్యంలో ఎన్నో దారుణ విషయాలు బయటపడుతున్నాయి. మిడ్-డేలో తాజా నివేదిక ప్రకారం, .. ఈ కేసులో మొదటి చార్జిషీట్ దాఖలైంది. రాజ్ కుంద్రా అతని సంస్థ `బాలీ ఫేమ్ మీడియా లిమిటెడ్` నిర్దేశించిన ఆర్థిక లక్ష్యాలను ముంబై పోలీసులు వివరించారు. గత సంవత్సరం గూగుల్ ప్లేస్టోర్.. ఆపిల్ నుండి వయోజన చలనచిత్ర కంటెంట్ అనువర్తనం(యాప్) హాట్ షాట్ లను నిషేధించిన తర్వాత బాలీ ఫేమ్ యాప్ ని అమల్లోకి తెచ్చారు.
ఛార్జ్ షీట్లో 2023-24 నాటికి రూ.146 కోట్లు ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని.. సుమారు 34 కోట్ల రూపాయల ఏడాది నికర లాభం ఆర్జించాలని ప్లాన్ చేశారని మిడ్-డే నివేదిక పేర్కొంది. ఇది 2021-22 ... 2022-23 సంవత్సరానికి రెట్టింపు అవుతుందని విశ్లేషించారు.
ప్రచురణతో ఒక క్రైమ్ బ్రాంచ్ అధికారి మాట్లాడుతూ,.. పత్రాలను కుంద్రా అసిస్టెంట్ కామత్ నుండి స్వాధీనం చేసుకున్నాం. మేము మొదటి చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు కుంద్రాను అరెస్టు చేయలేదు. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు బాలీఫేమ్ గురించి మాకు మరింత స్పష్టత వస్తుంది. అనంతరం అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం అని తెలిపారు.
కుంద్రాకి చెందిన హాట్ షాట్ యాప్ నిషేధించబడిన తరువాత కంటెంట్ బాలీ ఫేమ్ కు మార్చారని క్రైమ్ బ్రాంచ్ పేర్కొంది. సర్వర్ వివరాలు సహా ఇతర వివరాలను రాజ్ కుంద్రా కార్యాలయం నుండి వారాంతంలో అనేక ఫైళ్లు పత్రాల రూపంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై పోలీసులకు మరింత స్పష్టత రావాల్సి ఉంది.
కామత్, .. కుంద్రా అలానే అతని బావ ప్రదీప్ బక్షి మధ్య వాట్సాప్ చాట్స్ స్పష్టంగా బయటపడ్డాయి. హాట్ షాట్ చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు తనకు ప్లాన్ బి ఉందని బాలీ ఫేమ్ యాప్ రూపంలో ఉందని స్పష్టంగా ఆ చాట్ పేర్కొంది. ఇది కంటెంట్ ను అప్ లోడ్ చేసిన హాట్ షాట్ కంటే ఎక్కువ ఆదాయాలు చందాలను తెస్తుంది .. అని అధికారి పోర్టల్ కు చెప్పారు.
రాజ్ కుంద్రా కస్టడీ ఇప్పటికే ముగిసింది. ఈ కేసు ఈ రోజు మరోసారి కోర్టులో విచారణకు వస్తుంది. ఇంతలో షెర్లిన్ చోప్రాను జూలై 27 న వారి ముందు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ పిలిచింది. పలువురు మోడల్స్ ఫిర్యాదులను క్రైమ్ బ్రాంచ్ పరిశీలిస్తోంది. షెర్లిన్.. పూనమ్ పాండే.. మోడల్ జోయా.. ఇంకా తెలియని ఎన్నో పేర్లు ఈ కేసులో బయటపడుతున్నాయి.